Site icon NTV Telugu

Airtel Rs 48 Plan : ఎయిర్‌టెల్ నుంచి అదిరిపోయే ప్లాన్.. ఈ ఆఫర్‌ తెలిస్తే యూజర్లు అస్సలు వదలరు!

Airtel

Airtel

Airtel Rs 48 Plan : ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ యూజర్స్‌కు గుడ్ న్యూస్. కంపెనీ యూజర్స్ కోసం కొత్త రూ.48 రీఛార్జ్ ప్లాన్‌ను స్టార్ట్ చేసిందని మీలో ఎంత మందికి తెలుసు. నిజానికి ఈ ప్లాన్.. డేటా వోచర్, OTT (ఓవర్-ది-టాప్) ప్రయోజనాలను అందిస్తుంది. ఈ కొత్త ప్రస్తుతం అనేక సర్కిళ్లలో అందుబాటులో ఉంది. ఐపీఎల్ 2026 ప్రారంభమైన నేపథ్యంలో యూజర్స్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026ను ఆస్వాదించేలా టెలికాం కంపెనీలు ఇప్పుడు తక్కువ బడ్జెట్ ప్లాన్‌లకు కూడా OTT ప్రయోజనాలను అందిస్తున్నాయి. తాజాగా ఎయిర్‌టెల్ ప్రవేశపెట్టిన ఈ రూ.48 రీఛార్జి ప్లాన్ డిటేల్స్ బెనిఫిట్స్ ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

READ ALSO: Gold Rates: గోల్డ్ లవర్స్‌కు షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు

ఎయిర్‌టెల్ తాజాగా ప్రకటించిన ఈ ప్లాన్ 1GB 4G డేటా, ఒక నెల జియోహాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తుంది. 1GB డేటా తక్కువగా అనిపించినప్పటికీ, ఈ ప్లాన్‌లోని ముఖ్యమైన ఫీచర్ ఏమిటంటే, జియోహాట్‌స్టార్. అవునండీ.. ఐపీఎల్ 2026 చూడటానికి జియోహాట్‌స్టార్‌ను యాక్సెస్ చేయాలనుకునే వారికి ఈ ప్లాన్ బెస్ట్ ఛాయిస్ కింద పని చేస్తుందని చెబుతున్నారు. ఈ కొత్త ప్లాన్ కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో రీఛార్జ్ కోసం అందుబాటులో ఉంది. మీరు కంపెనీ యాప్ ద్వారా కూడా ఈ ప్లాన్‌ను రీఛార్జ్ చేసుకోవచ్చు. అలాగే ఈ డేటా వోచర్ దాదాపు ప్రతి సర్కిల్‌లో కూడా అందుబాటులో ఉంది. ఎయిర్‌టెల్ నుంచి జియోహాట్‌స్టార్‌తో వచ్చే ఏకైక ఎయిర్‌టెల్ డేటా ప్లాన్ ఇది మాత్రమే కాదు.. ఈ కంపెనీ తన రూ.195, రూ.279, రూ.361 ప్లాన్‌లతో కూడా OTT ప్రయోజనాలను అందిస్తుంది. రూ.279 ప్లాన్ నెట్‌ఫ్లిక్స్, ZEE5 సబ్‌స్క్రిప్షన్‌లను అందిస్తుంది.

జియో 100 ప్లాన్
రిలయన్స్ జియో విషయానికి వస్తే, ప్రీపెయిడ్ యూజర్స్‌కు జియో హాట్‌స్టార్ బెనిఫిట్స్ పొందడానికి కనీసం రూ.100 ఖర్చు చేయాల్సి ఉంటుంది. మీరు ఖర్చు చేసే రూ.100 లకు తగినట్లుగానే, బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ఎయిర్‌టెల్ రూ.48 ప్లాన్ కేవలం 1GB డేటాను మాత్రమే అందిస్తుండగా, జియో రూ.100 ప్లాన్ 5G డేటాను అందిస్తుంది, అంతేకాకుండా ఈ ప్లాన్‌తో 30 రోజుల పాటు జియో హాట్‌స్టార్ మొబైల్ యాక్సెస్‌ను కూడా వస్తుంది.

READ ALSO: Delhi Capitals: ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆ అదృష్టం ఉందా?

Exit mobile version