Technical Error: గాల్లో ఉండగానే సాంకేతిక లోపం.. 2 స్పైస్‌జెట్ విమానాలు దారి మళ్లింపు
- వేర్వేరు సంఘటనలలో రెండు స్పైస్‌జెట్ విమానాలు దారి మళ్లింపు
- ఒకటి షిల్లాంగ్‌కు, మరొక విమానాన్ని కొచ్చికి సాంకేతిక సమస్యల కారణంగా డైవర్ట్
- విమానాల్లో ఉన్న ప్రయాణికులకు ప్రమాదమేమీ లేదు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సోమవారం జరిగిన వేర్వేరు సంఘటనలలో రెండు స్పైస్‌జెట్ విమానాలను దారి మళ్లించారు. ఒకటి షిల్లాంగ్‌కు, మరొక విమానాన్ని కొచ్చికి సాంకేతిక సమస్యల కారణంగా డైవర్ట్ చేశారు విమానాయాన అధికారులు. కాగా.. అందులో ఉన్న ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదమేమీ లేదు. ఢిల్లీ-షిల్లాంగ్ స్పైస్‌జెట్ విమానం గాలిలో ఉండగానే మధ్యలో సాంకేతిక లోపం తలెత్తడంతో పాట్నా ఎయిర్ పోర్టులో సురక్షితంగా ల్యాండ్ చేశారు. పాట్నా ఎయిర్‌పోర్ట్ డైరెక్టర్ అంచల్ ప్రకాష్ మాట్లాడుతూ.. విమానం ఉదయం 8.52 గంటలకు పాట్నాలోని జై ప్రకాష్ నారాయణ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అయిందని తెలిపారు. గాల్లో ఉండగానే పక్షి ఢీకొనడంతో విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేసినట్లు చెప్పారు. ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఇది సాధారణ ల్యాండింగ్.. విమానంలో ఉన్న ప్రయాణీకులు, సిబ్బంది అందరూ సురక్షితంగా ఉన్నట్లు పేర్కొన్నారు.
Read Also: Pushpa 2: బాక్స్ ఆఫీస్ రప్పా రప్పా అంటే ఇదే.. నాలుగు రోజుల్లో 829!
Also Read
- PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
- Abhishek Sharma: సూర్యకుమార్ యాదవ్ రికార్డును మడతపెట్టేసిన అభిషేక్ శర్మ.. వరల్డ్ రికార్డు..
- Police VS CJP: అభిజిత్ దీప్కే ఆరోపణలు.. సాక్ష్యంగా ఢిల్లీ పోలీసులు వీడియో రిలీజ్.
- Abhishek Sharma: కాటేరమ్మ కొడుకుకి పూనకాలు.. రికార్డుల మీద రికార్డులు..
మరొక సంఘటనలో 117 మంది ప్రయాణికులు, సిబ్బందితో కొచ్చికి వెళ్లే ప్రైవేట్ క్యారియర్ విమానం గాల్లో ఉండగానే మధ్యలో సాంకేతిక సమస్య రావడంతో చెన్నైలో “అత్యవసర ల్యాండింగ్” చేశారు. ఈ క్రమంలో.. విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది. స్పైస్‌జెట్ ప్రతినిధి మాట్లాడుతూ.. “చెన్నై నుండి కొచ్చికి వెళ్లే స్పైస్‌జెట్ క్యూ400 విమానం సాంకేతిక సమస్య కారణంగా తిరిగి చెన్నైకి వచ్చింది. విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది.. ప్రయాణికులను దించేశాం.” అని తెలిపారు. అవసరమైన భద్రతా చర్యలు అమల్లో ఉన్నాయని, విమానం సురక్షితంగా ల్యాండింగ్ అయ్యిందని విమానాశ్రయ అధికారులు తెలిపారు.
Read Also: AUS vs IND 2nd Test: ఆసీస్ విజయానికి వాళ్లిద్దరే కారణం.. మా టార్గెట్ అదే..!
తాజావార్తలు
-
PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
-
Festive Sale: పండుగ షాపింగ్ తుఫాన్.. 48 గంటల్లో రూ.24,000 కోట్ల సేల్స్!
-
Abhishek Sharma: సూర్యకుమార్ యాదవ్ రికార్డును మడతపెట్టేసిన అభిషేక్ శర్మ.. వరల్డ్ రికార్డు..
-
El Nino : తెలంగాణలో కరువు ముప్పు.. రెండో పంట వేయొద్దంటూ మంత్రి కీలక విజ్ఞప్తి
-
Police VS CJP: అభిజిత్ దీప్కే ఆరోపణలు.. సాక్ష్యంగా ఢిల్లీ పోలీసులు వీడియో రిలీజ్.
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!