NTV Telugu Site icon

IND vs BAN: బంగ్లాదేశ్‌పై టీమిండియా ఈజీ విక్టరీ..

Ind Won

Ind Won

బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది. 7 వికెట్ల తేడాతో టీమిండియా గెలుపొందింది. 128 పరుగుల లక్ష్యాన్ని ఇంకా 49 బంతులు ఉండగానే చేధించింది. 11.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 132 పరుగులు చేసింది. భారత్ బ్యాటింగ్‌లో హార్ధిక్ పాండ్యా అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. 16 బంతులు ఆడి 39 పరుగుల అజేయ ఇన్నింగ్స్ ఆడాడు. ఆ తర్వాత.. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (29), సంజూ శాంసన్ (29) పరుగులతో రాణించారు. అభిషేక్ శర్మ (16), నితీశ్ కుమార్ రెడ్డి (16*) పరుగులు చేశారు. బంగ్లాదేశ్ బౌలింగ్‌లో ముస్తిఫిజుర్ రహమన్, మెహిదీ హసన్ మిరాజ్ చెరో వికెట్ తీశారు.

Indian Air Force: చైనా స్పై బెలూన్ లాంటి లక్ష్యాన్ని కూల్చేసిన రాఫెల్ ఫైటర్ జెట్స్..

మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్.. 19.5 ఓవర్లలో 127 పరుగులకు ఆలౌట్ అయింది. బంగ్లా బ్యాటింగ్‌లో అత్యధికంగా మెహిది హసన్ మిరాజ్ (35*) పరుగులు చేశాడు. కెప్టెన్ షాంటో (27) పరుగులతో పర్వాలేదనిపించాడు. పర్వేజ్ హుస్సేన్ (8), హృదోయ్ (12), రిషద్ హుస్సేన్ (11), టస్కిన్ అహ్మద్ (12) పరుగులు చేశారు. భారత్ బౌలింగ్‌లో మయాంక్ యాదవ్ తన తొలి ఓవర్ను మెడిన్ చేసి రికార్డు సృష్టించాడు. అంతేకాకుండా.. తన బౌలింగ్‌లో ఒక వికెట్ కూడా సంపాదించాడు. అత్యధికంగా వరుణ్ చక్రవర్తి 3, అర్ష్‌దీప్ సింగ్ 3 వికెట్లు పడగొట్టారు. హార్ధిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్ తలో వికెట్ తీశారు. భారత్ విజయంతో 3-0 ఆధిక్యంలో ఉన్నారు. కాగా.. రెండో టీ20 మ్యాచ్ ఈనెల 9వ తేదీన ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగనుంది.

Breaking: ఎయిర్‌ షో ఘటనలో ఐదుకు చేరిన మృతుల సంఖ్య..