సౌతాఫ్రికా-భారత్ జట్ల మధ్య నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరుగనుంది. ఈరోజు మళ్లీ 2024 టీ20 ప్రపంచకప్ ఫైనలిస్టులు తలపడనున్నారు. ఇరు జట్ల మధ్య మొదటి టీ20 మ్యాచ్ ఈరోజు జరుగనుంది. అందులో భాగంగా.. టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా మొదట ఫీల్డింగ్ ఎంచుకోగా.. భారత్ బ్యాటింగ్ చేయనుంది. డర్బన్ వేదికగా రాత్రి 8.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.
బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది. 7 వికెట్ల తేడాతో టీమిండియా గెలుపొందింది. 128 పరుగుల లక్ష్యాన్ని ఇంకా 49 బంతులు ఉండగానే చేధించింది. 11.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 132 పరుగులు చేసింది.
భారత్-బంగ్లాదేశ్ మధ్య గ్వాలియర్ వేదికగా తొలి టీ20 మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్.. నిర్ణీత 19.5 ఓవర్లలో 127 పరుగులకు ఆలౌట్ అయింది. టీమిండియా బౌలర్ల దాటికి బంగ్లాదేశ్ గౌరవప్రదమైన స్కోరు చేసింది. దీంతో భారత్ ముందు 128 పరుగుల లక్ష్యాన్ని ఉంచారు.
భారత్-బంగ్లాదేశ్ మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా.. ఈరోజు గ్వాలియర్ లో మొదటి టీ20 జరుగనుంది. ఈ క్రమంలో టీమిండియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. కాగా.. ఈ మ్యాచ్ తోనే అంతర్జాతీయ క్రికెట్ లోకి యువ ఫాస్ట్ బౌలర్ మయాంక్ యాదవ్ అడుగుపెడుతున్నాడు. ఇప్పుడు క్రికెట్ అభిమానుల అందరి దృష్టి అతని పైనే ఉంది. మయాంక్‌తో పాటు ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ బంగ్లాదేశ్‌తో అరంగేట్రం చేస్తున్నాడు.
భారత్- బంగ్లాదేశ్ మధ్య తొలి టీ20 మ్యాచ్ గ్వాలియర్‌లో జరుగనుంది. MPCA స్టేడియంలో ఎల్లుండి (6 అక్టోబర్ 2024) మ్యాచ్ జరుగనుంది. అందులో భాగంగా ఇరు జట్లు తొలి టీ20 కోసం గ్వాలియర్ చేరుకున్నాయి. సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని టీమిండియా నెట్ సెషన్‌లో విపరీతంగా చెమటలు పట్టిస్తుంది.