IND vs BAN: బంగ్లాదేశ్‌పై టీమిండియా ఈజీ విక్టరీ..
- బంగ్లాదేశ్‌పై టీమిండియా ఈజీ విక్టరీ
- 11.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 132 పరుగులు చేసిన భారత్
- 7 వికెట్ల తేడాతో గెలుపు
- 1-0 ఆధిక్యంలో ఇండియా.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది. 7 వికెట్ల తేడాతో టీమిండియా గెలుపొందింది. 128 పరుగుల లక్ష్యాన్ని ఇంకా 49 బంతులు ఉండగానే చేధించింది. 11.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 132 పరుగులు చేసింది. భారత్ బ్యాటింగ్‌లో హార్ధిక్ పాండ్యా అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. 16 బంతులు ఆడి 39 పరుగుల అజేయ ఇన్నింగ్స్ ఆడాడు. ఆ తర్వాత.. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (29), సంజూ శాంసన్ (29) పరుగులతో రాణించారు. అభిషేక్ శర్మ (16), నితీశ్ కుమార్ రెడ్డి (16*) పరుగులు చేశారు. బంగ్లాదేశ్ బౌలింగ్‌లో ముస్తిఫిజుర్ రహమన్, మెహిదీ హసన్ మిరాజ్ చెరో వికెట్ తీశారు.
Indian Air Force: చైనా స్పై బెలూన్ లాంటి లక్ష్యాన్ని కూల్చేసిన రాఫెల్ ఫైటర్ జెట్స్..
Also Read
మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్.. 19.5 ఓవర్లలో 127 పరుగులకు ఆలౌట్ అయింది. బంగ్లా బ్యాటింగ్‌లో అత్యధికంగా మెహిది హసన్ మిరాజ్ (35*) పరుగులు చేశాడు. కెప్టెన్ షాంటో (27) పరుగులతో పర్వాలేదనిపించాడు. పర్వేజ్ హుస్సేన్ (8), హృదోయ్ (12), రిషద్ హుస్సేన్ (11), టస్కిన్ అహ్మద్ (12) పరుగులు చేశారు. భారత్ బౌలింగ్‌లో మయాంక్ యాదవ్ తన తొలి ఓవర్ను మెడిన్ చేసి రికార్డు సృష్టించాడు. అంతేకాకుండా.. తన బౌలింగ్‌లో ఒక వికెట్ కూడా సంపాదించాడు. అత్యధికంగా వరుణ్ చక్రవర్తి 3, అర్ష్‌దీప్ సింగ్ 3 వికెట్లు పడగొట్టారు. హార్ధిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్ తలో వికెట్ తీశారు. భారత్ విజయంతో 1-0 ఆధిక్యంలో ఉన్నారు. కాగా.. రెండో టీ20 మ్యాచ్ ఈనెల 9వ తేదీన ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగనుంది.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!