మైనారిటీ గురుకులంలో దారుణంజరిగింది. స్కూల్లో చదువుతున్న మైనర్ బాలుడిపై గత మూడు సంవత్సరాలుగా అసహజ లైంగిక దాడికి పాల్పడుతున్న జువాలజీ ఉపాధ్యాయుడు ప్రభాకర్ రావుపై కేసు నమోదైంది. దీంతో భయపడ్డ అతను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం అమ్మపాలెంలోని మైనారిటీ బాయ్స్ రెసిడెన్షియల్ స్కూల్‌లో ఓ ఉపాధ్యాయుడు నీచమైన పనికి దిగాడు. ఇక్కడ చూడండి.. ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు ప్రభాకర్ రావు. జువాలజీ ఉపాధ్యాయుడుగా ఔట్ సోర్సింగ్ పద్ధతిలో పని చేస్తున్నాడు. బాయ్స్ రెసిడెన్షియల్ స్కూల్‌లో 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని గత 3 సంవత్సరాలుగా అసహజ పద్ధతి లో లైంగికంగా వేధిస్తున్నాడు.
Also Read:Juice: జ్యూస్ తాగి 15 గంటల పాటు నిద్రపోయిన పలువురు వ్యక్తులు.. ఆ ముస్లిం యువకుడు ఎవరు?
విద్యార్థి.. ఇంటికి వెళ్లి తిరిగి వచ్చేటప్పుడు తాను స్కూలుకు వెళ్లనని చెప్పడంతో విషయం బయటపడింది. తరచూ తనను స్కూలులో జువాలజీ టీచర్ ప్రభాకర్ రావు లైంగికంగా వేధిస్తున్నట్లు తల్లిదండ్రులకు ఫిర్యాదు చేశాడు బాలుడు. ఘటనపై పాఠశాల ప్రిన్సిపాల్‌తో పాటు కొణిజర్ల పోలీసులకు విద్యార్థి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. విద్యార్థి తల్లిదండ్రుల ఫిర్యాదు ఆధారంగా నిందితుడు జువాలజీ టీచర్‌గా పనిచేస్తున్న ప్రభాకర్ రావుపై కొణిజర్ల పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. టీచర్ వ్యవహారం ఉన్నతాధికారులకు తెలియడంతో ఉద్యోగం నుంచి తొలగించారు.
Also Read:KTR : ఈ ఫేక్ ఓటర్లలో మైనర్లు కూడా.. కీలక విషయాలు వెల్లడించిన కేటీఆర్
విషయం బయటికి రావడంతో ఉపాధ్యాయుడు తన సొంత గ్రామమైన ఆత్కూరులో పురుగుల మందుతాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ప్రభాకర్ రావుని హైదరాబాదులోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా పరిస్థితి విషమించి మృతి చెందాడు. ప్రభాకర్ రావుకు పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్నారు. పిల్లలకు విద్యాబుద్ధులు చెప్పి ఉన్నత స్థాయికి తీసుకు వెళ్లేందుకు తోడ్పడి కంటికి రెప్పలా కాపాడవలసిన ఉపాధ్యాయుడు.. కామంతో కళ్లు మూసుకుపోయి మైనర్ విద్యార్థిపై లైంగిక దాడికి పాల్పటం సభ్య సమాజం తలదించుకునే పరిస్థితి ఏర్పడింది.