Srikakulam: నేటి బాలల్ని రేపటి పౌరులుగా తీర్చిదిద్దాల్సిన ఉన్నతమైన, గౌరప్రదమైన ఉద్యోగం చేస్తున్న ఓ లేడీ టీచర్ చేసి ఉదంతం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విద్యాబుద్దులు నేర్చాల్సిన ఉపాధ్యాయురాలు బుద్ధి లేని పని చేసింది. చిన్న పిల్లల(విద్యార్థినులు)తో కాళ్లు నొక్కించుకుంది. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలం బందపల్లి బాలికల గిరిజన ఆశ్రమ పాఠశాలలో వెలుగు చూసింది.
మైనారిటీ గురుకులంలో దారుణంజరిగింది. స్కూల్లో చదువుతున్న మైనర్ బాలుడిపై గత మూడు సంవత్సరాలుగా అసహజ లైంగిక దాడికి పాల్పడుతున్న జువాలజీ ఉపాధ్యాయుడు ప్రభాకర్ రావుపై కేసు నమోదైంది. దీంతో భయపడ్డ అతను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం అమ్మపాలెంలోని మైనారిటీ బాయ్స్ రెసిడెన్షియల్ స్కూల్‌లో ఓ ఉపాధ్యాయుడు నీచమైన పనికి దిగాడు. ఇక్కడ చూడండి.. ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు ప్రభాకర్ రావు. జువాలజీ ఉపాధ్యాయుడుగా ఔట్ సోర్సింగ్ పద్ధతిలో పని చేస్తున్నాడు.…
Nalgonda: పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించి.. భావి పౌరులుగా తయారు చేయాల్సిన ఉపాధ్యాయులే దారితప్పుతున్నారు. తమ ఇంట్లో కంటే పాఠశాలలోనే ఉంటూ ఉపాధ్యాయులతో విద్యార్థులు తమ అనుబంధాన్ని పెంచుకుంటారు. బాలికలు తమకు చదువు నేర్పే గురువులను తమ తండ్రిలాగా భావిస్తారు. కానీ కొందరు టీచర్లు వెకిలి చేష్టలతో గురువులపై ఉండే గౌరవం రోజురోజుకూ సన్నగిల్లుతోంది. అలాంటి ఓ కీచక గురువు.. విద్యార్ధినులపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన తాజాగా తెలంగాణ రాష్ట్రంలో చోటు చేసుకుంది.
నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం కుద్వాన్‌పూర్ ప్రాథమిక పాఠశాలలో దారుణ ఘటన వెలుగుచూసింది. విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడు శంకర్, రెండో తరగతి విద్యార్థులపై కర్కశంగా ప్రవర్తించాడు.
రష్యాలో ఓ టీచర్ విద్యార్థితో చేయకూడని పనులు చేసింది. తన వద్ద విద్యాభ్యాసం చేసే విద్యార్థిని లొంగదీసుకుని తన శృంగార కోర్కెలను తీర్చుకుంది. బాలుడి తల్లికి ఈ విషయం తెలిసి.. ఆమె పోలీసులను సంప్రదించింది. దీంతో ఆ ఉపాధ్యాయురాలికి తొమ్మిది ఏళ్ల జైలు శిక్ష పడింది.
Caste Discrimination : వసతి గృహాల్లో విద్యార్థులకు విద్య బుద్ధులు నేర్పవలసిన ఉపాధ్యాయులు కుల వివక్షత చూపిస్తున్నారంటూ ఒక బాలిక సెల్ఫీ వీడియో పంపించడం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సంచలనం రేకెత్తిస్తుంది. తమకు ఈ పురుష ఉపాధ్యాయులు వద్దంటూ మహిళల్ని నియమించాలని కన్నీళ్ళతో వేడుకుంటుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం రామచంద్రుని పేట ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాలలో లంబాడి సామాజిక వర్గానికి చెందిన ప్రధాన ఉపాధ్యాయుడు కులం పేరుతో తమను దూషిస్తున్నాడు అంటూ లంబాడి…
గురువు అంటే తండ్రిలా భావించి, విద్యార్థులను కంటికి రెప్పలా చూసుకోవాలి. వారికి విద్యాభ్యాసం, సరైన మార్గదర్శనాలు అందించి సమాజంలో మంచి వ్యక్తులుగా తీర్చిదిద్దాలి. కానీ కొంతమంది వ్యక్తులు గాడి తప్పి, వారి పాత్రను మరిచిపోతున్నారు.