కొన్ని క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ నేరుగా ఓటీటీలో విడుదక అవుతున్నాయి.. ఇప్పటికే ఎన్నో సినిమాలు ఇక్కడ విడుదలయ్యి మంచి రెస్పాన్స్ ను అందుకున్నాయి.. తాజాగా మరో క్రైమ్ థ్రిల్లర్ సస్పెన్స్ మూవీ ఎస్. ఐ. టి. మూవీలోకి వచ్చేస్తుంది.. అరవింద్ కృష్ణ , రజత్ రాఘవ్ హీరోలుగా నటించిన మూవీ ఓటీటీ లోకి వచ్చేందుకు ముహూర్తం ఫిక్స్ చేసుకుంది..
ఈ సినిమా మే 10 న ఓటీటీలోకి రాబోతుంది.. రిలీజ్ డేట్‌ను జీ5 ఓటీటీ అఫీషియల్‌గా అనౌన్స్‌చేసింది. కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేసింది. ఈ పోస్టర్‌లో పోలీస్ ఆఫీసర్ గా సీరియల్ ఇంటెన్స్ లుక్‌లో అరవింద్ కృష్ణ కనిపిస్తోన్నాడు.. ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది. ఇక ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లుగా నటిస్తున్నారు.. నటాషాదోషి, రుచితా సాదినేని హీరోయిన్లుగా నటిస్తున్నారు… ఇక వీబీఆర్ దర్శకత్వం వహిస్తున్నారు..
ఈ సినిమా కథ విషయానికొస్తే.. స్పెషల్ ఇన్వేస్టిగేషన్ టీమ్ ఓ క్రైమ్ ను సాల్వ్ చేసేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేసింది అనేది సినిమాలో చూపించారు.. క్రైమ్‌ను తన తెలివితేటలతో ఓ పోలీస్ ఆఫీసర్ ఎలా సాల్వ్ చేశాడు అన్నది థ్రిల్లింగ్‌గా ఈ మూవీలో చూపించబోతున్నట్లు సమాచారం.. ఇక ఈ సినిమా కౌశిక్ మేకల, అనిల్ రాథోడ్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. గత ఏడాది ఈ మూవీ షూటింగ్ పూర్తయింది.. థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలోకి రాబోతుంది.. అక్కడ ఎలాంటి టాక్ ను అందుకుంటుందో చూడాలి..