ఏపీలో రాజకీయ విమర్శలు తారస్థాయికి చేరుకుంటున్నాయి. జగన్ ఓటమి భయంతో చంద్రబాబు పర్యాటనలో బౌతిక దాడులు చేయిస్తున్నాడని మండిపడ్డారు టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి. కోడికత్తి కేసు, బాబాయ్ వివేకా హత్య కేసులను టీడీపీ పైకి నెట్టి జగన్ ఎన్నికల్లో గెలిచాడని అన్నారు.. బాబాయ్ హత్య కేసు నుండి తమ్ముడిని కాపాడుకోనే ప్రయత్నం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. అవినీతి అధికారులను పెట్టుకుని దుర్మార్గ పాలన చేయడంతో రాష్ట్రంలో క్రైమ్ పెరిగిపోవడానికి వైసిపి ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. ప్రభుత్వ పతనానికి దగ్గరపడిందన్నారు. జగనన్న కోడి కత్తి నాటకం వారి అనుచరుల ప్రమేయమేనని బుచ్చయ్య చౌదరి అన్నారు.
Read Also: Indian Railways: సీనియర్ సిటిజన్ల టికెట్లపై రాయితీ రద్దు.. రైల్వేకు రూ.2,242 కోట్ల అదనపు ఆదాయం..
ముఖ్యమంత్రి జగన్ నిరంతరం గాలిలో తిరుగుతున్నారే తప్ప వర్షాలకు పంటలు నీట మునిగిన పట్టించుకోరా అని ప్రశ్నించారు. మహానటుడు రజనీకాంత్ పై వైసీపీ నేతలు అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఖండించారు. ఈ సందర్భంగా గోరంట్ల బుచ్చయ్య చౌదరి జగన్నారకాసుర, అవినీతి నిరోధక రక్షకుడు జగన్ అంటూ ముద్రించిన పోస్టర్ ను జనం చించి వేసి చెత్తబుట్టాలో వేశారన్నారు టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి.