TDP-Janasena: ఏపీలో టీడీపీ-జనసేన పార్టీలు దూకుడును పెంచాయి. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కూటమి అభ్యర్థుల తొలి జాబితాను సిద్ధం చేశాయి. దీనిని రేపు అధికారికంగా ప్రకటించనున్నారు. మాఘ పౌర్ణమి మంచి రోజు కావడంతో రెండు పార్టీల అధినేతలు తొలి జాబితాను విడుదల చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలుమార్లు చంద్రబాబు, పవన్ కల్యాణ్ సమావేశమై సీట్ల షేరింగ్‌పై చర్చించారు. దాదాపు 60 నుంచి 70 సీట్ల వరకు ప్రకటించడానికి సిద్ధమైనట్లు సమాచారం. ముఖ్య నేతలంతా అందుబాటులో ఉండాలని రెండు పార్టీలు ఆయా పార్టీల నేతలకు సమాచారం ఇచ్చాయి.
Read Also: Pawan Kalyan:”ఆంధ్రలో ఏదైనా మార్పు వస్తే పవన్ ద్వారానే రావాలి.. అల్లు అర్జున్ మామ ఆసక్తికర వ్యాఖ్యలు
ఉదయం 9 గంటల వరకు పార్టీ ఆఫీసుకు చేరుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. తొలి జాబితాకు ఉదయం 11:40 గంటలకు ముహూర్తం ఖరారు చేశారు. తొలి జాబితాలో 60 నుంచి 70 సీట్లకు ఇరు పార్టీల అభ్యర్థుల పేర్లు ప్రకటించే అవకాశం ఉంది . ఈ జాబితాను టీడీపీ అధినేత చంద్రబాబు, జన సేన చీఫ్ పవన్ కళ్యాణ్ లు విడుదల చేయనున్నారని పార్టీ వర్గాల సమాచారం . మరోవైపు బీజేపీతో పొత్తుపై చర్చలు కొనసాగుతున్న నేపథ్యంలో పూర్తి జాబితా సిద్ధం కాలేదని తెలుస్తోంది. తొలి జాబితాతో పార్టీ నాయకుల్లో జోష్ నింపేందుకు నిర్ణయించినట్లు సమాచారం. ఫిబ్రవరి 28న తాడేపల్లిగూడెంలో ఇరు పార్టీలు ఉమ్మడిగా బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే.
