Allu Arjun’s Father in Law K Chandra Shekar Reddy Comments on Pawan kalyan: లోక్‌సభ ఎన్నికల ముందు తెలంగాణ కాంగ్రెస్ లోకి చేరికలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా ప్రముఖ సినీనటుడు అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్‌రెడ్డి ఇటీవల కాంగ్రెస్‌లో చేరారు. గాంధీభవన్‌లో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దీప్‌దాస్ మున్షీ వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించగా చంద్రశేఖర్‌రెడ్డితో పాటు పార్టీలో చేరిన నేతలంతా అసెంబ్లీకి వెళ్లి సీఎం రేవంత్‌రెడ్డిని కలిశారు.త చంద్రశేఖర్ రెడ్డి నల్గొండ జిల్లా పెద్దవూర మండలంలో ఫౌండేషన్ ఏర్పాటు చేసి పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ నుంచి నాగార్జునసాగర్ టికెట్ ఆశించి తన గెలుపు కోసం బన్నీ ప్రచారం చేస్తాడని కూడా ఆయన ప్రకటించారు.
MLA Lasya Nanditha: ఎమ్మెల్యే లాస్య నందిత కారు ప్రమాదంపై కేసు నమోదు
కానీ, బీఆర్ఎస్ టికెట్ ఇవ్వకపోవడంతో అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న ఆయన కాంగ్రెస్‌లో చేరారు. అయితే తాజాగా ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కొన్ని ఆసక్తిక్రమైన వ్యాఖ్యలు చేశారు.. పవన్ కళ్యాణ్ జనసేన తెలంగాణాలో కూడా ఉంది కదా దాని గురించి మీ అభిప్రాయం ఏమిటి అని ప్రశ్నిస్తే తెలంగాణలో ఆ పార్టీ అంతగా ఎస్టాబ్లిష్ కాలేదని అన్నారు. ఆంధ్రాలో ఆ పార్టీ 100 శాతం ఉందని, అక్కడ మార్పు ఏదైనా వస్తే అది పవన్ కళ్యాణ్ కారణంగానే వస్తుందని అన్నారు. అక్కడ చంద్రబాబు పార్టీకి జనసేన యాడ్ అయినప్పుడు మార్పు వస్తుందని అనుకుంటున్నాను. ఇప్పుడు వస్తే మార్పు రావాలి అని ఆయన కామెంట్ చేశారు.