NTV Telugu Site icon

TDP-JanaSena-BJP Alliance: అమిత్‌షాతో ముగిసిన చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ భేటీ.. పొత్తు ఖరారు..

Ap 2

Ap 2

TDP-JanaSena-BJP Alliance: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల పొత్తులపై చర్చలు ఓ కొలిక్కి వచ్చాయి.. గత కొంత కాలంగా టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తుపై సస్పెన్స్‌ కొనసాగు వస్తుండగా.. ఈ రోజు ఉత్కంఠకు తెరపడింది.. పొత్తులపై తేల్చుకోవడానికి ఢిల్లీలో మకాం వేసిన టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌.. అయితే, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నివాసంలో ఈ రోజు జరిగిన సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పొత్తులపై ఓ నిర్ణయానికి వచ్చారు.. టీడీపీ-జనసేన-బీజేపీ మధ్య అవగాహన కుదిరింది.

Read Also: IND vs ENG Test: అశ్విన్ మాయాజాలం.. రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్స్ కోల్పోయిన ఇంగ్లండ్!

అమిత్‌షా నివాసంలో జరిగిన ఈ సమావేశంలో అమిత్‌షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్‌ కల్యాణ్‌ పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఏపీలో సీట్ల సర్దుబాటుపై టీడీపీ-జనసేన-బీజేపీల మధ్య అవగాహన కుదిరింది. అయితే, పొత్తులపై, సీట్ల సర్దుబాటుపై కాసేపట్లో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని నేతలు చెబుతున్నమాట.. ఈ రోజు జరిగిన సమావేశంలో ఏపీ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై చర్చించారు. రాష్ట్ర, దేశ ప్రయోజనాల కోసం కలిసి పనిచేయాలని నేతలు నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది.. అంతేకాకుండా.. త్వరలో జరగబోయే ఎన్డీఏ సమావేశానికి కూడా టీడీపీ నేతలు హాజరయ్యే అవకాశం ఉందంటున్నారు.. ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై కూడా మూడు పార్టీల మధ్య అవగాహన కుదరగా.. మీడియా ద్వారా.. లేదా సోషల్ మీడియా వేదికగా ఎన్నికల పొత్తులపై అధికార ప్రకటన వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఇక, జనసేన, బీజేపీకి కలిసి 8 ఎంపీ సీట్లు ఇస్తారని ప్రచారం సాగుతోంది.. బీజేపీకి ఆరు ఎంపీ సీట్లు ఇస్తే.. మిగతా రెండు ఎంపీ స్థానాల్లో జనసేన.. లేదా బీజేపీకి ఐదు సీట్లు ఇస్తే.. జనసేకు మూడు ఎంపీ సీట్లు ఇచ్చే అవకాశం ఉంది. అరకు, నరసాపురం, రాజమండ్రి, తిరుపతి, రాజంపేట, హిందూపురంలో బీజేపీ పోటీ చేసే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది.

Show comments