టాలీవుడ్ యంగ్ హీరో తేజా సజ్జా,టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కాంబినేషన్ లో వచ్చిన హనుమాన్ మూవీ ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 12న తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ మూవీ మలయాళం భాషల్లో రిలీజైంది. అయితే ఊహించిన దాని కంటే ఎక్కువగానే ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ రూ.300 కోట్లకుపైగా కలెక్షన్లతో దుమ్ము రేపింది. ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.అయితే హనుమాన్ మూవీ కోసం రెండు నెలలుగా ఎదురు చూస్తున్న అభిమానుల ఎదురు చూపులు మరికొన్ని గంటల్లో తెరపడనుంది.. ఈ సినిమా ఒకేసారి ఓటీటీ, టీవీల్లోకి అడుగుపెట్టబోతోంది.శనివారం (మార్చి 16) రాత్రి 8 గంటలకు హనుమాన్ మూవీ చూసే అవకాశం బుల్లితెర ప్రేక్షకులకు లభించనుంది.
అయితే హనుమాన్ మూవీ ఓటీటీ, టీవీల్లోకి వస్తున్నా ప్రస్తుతానికి కేవలం హిందీ వెర్షన్ మాత్రమే చూసే వీలుంటుంది. ఈ మూవీ హిందీ వెర్షన్ హక్కులను జియో సినిమా సొంతం చేసుకుంది. దీంతో శనివారం రాత్రి 8 గంటల తర్వాత ఈ ఓటీటీలో ఎప్పుడైనా ఈ సినిమా చూడొచ్చు. ఇక అదే సమయానికి కలర్స్ సినీప్లెక్స్ ఛానెల్లోనూ హనుమాన్ టెలికాస్ట్ కానుంది.దీంతో ఒకేసారి ఓటీటీ మరియు టీవీ ప్రీమియర్ కానున్న సినిమాగా హనుమాన్ నిలవనుంది..హనుమాన్ జియో సినిమా ఓటీటీలోకి వస్తున్నా. కేవలం హిందీ వెర్షన్ కావడంతో తెలుగు ప్రేక్షకులు నిరాశ చెందుతున్నారు. నిజానికి తెలుగుతోపాటు ఇతర భాషల హక్కులు జీ5 ఓటీటీకి దక్కాయి. ఈ మధ్యే ఆ ఓటీటీ మూవీ రిలీజ్ పై అధికారిక ప్రకటన చేసింది. అభిమానుల ఎదురు చూపులు ఫలించబోతున్నాయని, త్వరలోనే హనుమాన్ ఓటీటీలోకి రాబోతోందని తెలిపింది.అయితే ఈ సినిమా కచ్చితంగా ఏ రోజు వస్తుందన్నది మాత్రం వెల్లడించలేదు. మార్చి 8న శివరాత్రి సందర్భంగానే వస్తుందని చాలా మంది భావించారు. కానీ దీనిపై ఎలాంటి సమాచారం లేదంటూ జీ5 నిరాశ పరిచింది. మొత్తానికి ఓ తేదీ అంటూ చెప్పకపోయినా.. త్వరలోనే అంటూ ఓ అధికారిక ప్రకటన ఆ ఓటీటీ నుంచి రావడంతో ప్రేక్షకులు కాస్త ఊరట చెందారు..