Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Tdp Chief Chandrababu Has Written An Open Letter On The Issue Of Pensions

Chandrababu: పెన్షన్ల అంశంపై టీడీపీ అధినేత బహిరంగ లేఖ..

Published Date :April 2, 2024 , 9:46 pm
By Rajesh Veeramalla
Chandrababu: పెన్షన్ల అంశంపై టీడీపీ అధినేత బహిరంగ లేఖ..
  • Follow Us :
  • google news
  • dailyhunt

పెన్షన్ల అంశంపై టీడీపీ అధినేత చంద్రబాబు బహిరంగ లేఖ రాశారు. పెన్షన్ దారులందరికీ ఇళ్ల వద్దే నగదు ఇవ్వాలి.. పెన్షన్ పంపిణీలో రెండు విధానాలు సరికావని లేఖలో పేర్కొన్నారు. పింఛన్ల పంపిణీ విషయంలో ముఖ్యమంత్రి కుట్రలకు, నాటకాలకు తెర దించాలని కోరారు. లబ్దిదారులందరికీ ఇళ్ల వద్దనే పింఛన్లు పంపిణీ చేయాలని తెలిపారు. సామాజిక పింఛన్ల పంపిణీ అనేది ప్రభుత్వ బాధ్యత అని ప్రస్తావించారు. ఆ బాధ్యతను సీఎం జగన్‌ సక్రమంగా నిర్వహించకుండా.. దురుద్దేశంతో వయోవృద్ధులు, దివ్యాంగులను అవస్థల పాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Vijay Deverakonda: పొగరు, బలుపు అనుకునేవాళ్ళు ఉంటారు.. కానీ 200 కోట్లు కొట్టి చూపిస్తా!

స్వార్ధ ప్రయోజనాల కోసం ఎప్పుడూ లేని విధంగా, ఎన్నికల ముందు పింఛన్ల పంపిణీపై కుట్రలు చేస్తున్నారని లేఖలో మండిపడ్డారు. గతేడాది 2022 ఏప్రిల్‌ 1వ తేదీకి ముందే పింఛన్ల నిధులు బ్యాంకుల నుంచి విత్‌ డ్రా చేసి 1వ తేదీన పంపిణీ చేశారన్నారు. ఈ ఏడాది కూడా ముందే బ్యాంకుల నుండి విత్‌ డ్రా చేసి ఉంటే ఎలాంటి ఇబ్బంది ఎదురయ్యేది కాదని ప్రస్తావించారు. మార్చి 16 నుండి మార్చి 30 మధ్య 15 రోజుల్లోనే సొంత కాంట్రాక్టర్లకు రూ.13 వేల కోట్లు విడుదల చేశారు.. పింఛన్‌ దారులకు ఇవ్వాల్సిన రూ.2 వేల కోట్లు కూడా సొంత కాంట్రాక్టర్లకు కట్టబెట్టి ఖజానా ఖాళీ చేశారని పేర్కొన్నారు. నిధుల కొరత వల్లే పింఛన్ల పంపిణీ జాప్యం చేస్తున్నారని చంద్రబాబు తెలిపారు.

Mahua moitra: మహువా మొయిత్రాకు షాక్.. ఈడీ కేసు నమోదు

గత ఎన్నికల సమయంలో బాబాయి హత్యను జగన్‌రెడ్డి రాజకీయ లబ్దికి వాడుకున్నాడని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. నారాసుర రక్త చరిత్ర అని తనపై నిందలేశాడని.. అలాగే నేడు పింఛన్ల పంపిణీ విషయంలో జగన్నాటకం ఆడుతూ పింఛన్‌దారులకు నమ్మక ద్రోహం చేస్తున్నారని పేర్కొన్నారు. ఏప్రిల్‌ 3వ తేదీ నుండి పింఛన్లు ఇళ్ల వద్ద కాకుండా సచివాలయాల్లో పంపిణీ చేస్తామని సెర్ప్‌ సీఈఓ మురళీధర్‌ రెడ్డి మార్చి 28న ఇచ్చిన పత్రికా ప్రకటన సీఎం అనుమతి లేకుండా ఇస్తే, ఆయనపై ఎందుకు చర్యలు తీసుకోలేదు? అని ప్రశ్నించారు. ఇంటి వద్దే పింఛన్‌ పంపిణీ చేయాలని ముఖ్యమంత్రిగా చీఫ్‌ సెక్రటరీ జవహర్‌ రెడ్డికి ఎందుకు ఆదేశాలివ్వలేదు? అని అన్నారు. తెలుగుదేశంపై నెపం నెట్టి ఎన్నికల్లో లబ్ది పొందడానికి.. అవ్వా తాతల్ని అవస్థల పాలు చేయడం దుర్మార్గం కాదా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తగిన సిబ్బంది లేనందున గ్రామాల్లో లబ్దిదారుల్ని గుర్తించడం కష్టమని, అందరికీ ఇంటి వద్ద పింఛన్‌ ఇవ్వలేమని ప్రభుత్వం కుంటి సాకులు చెప్పడం హాస్యాస్పదం అని పేర్కొన్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • ap govt
  • chandrababu
  • open letter
  • pensions
  • tdp

తాజావార్తలు

  • DC vs GT: నేడు ఢిల్లీ-గుజరాత్ మ్యాచ్.. రెడీ అవుతోన్న వరుణుడు.. ఢిల్లీలో వాతావరణం ఎలా ఉండబోతోంది?

  • Jailer2 : ఒకే ఫ్రేమ్‌లో నలుగురు సూపర్ స్టార్స్..

  • Ranjan : కోర్ట్ తమిళ రీమేక్.. వెండితెర ఎంట్రీ ఇస్తున్న స్టార్ హీరోయిన్ కూతురు

  • Hormuz Strait: చమురు కష్టాలకు బ్రేక్.. హోర్ముజ్ జలసంధిని తెరిచేందుకు ఇరాన్ గ్రీన్ సిగ్నల్!

  • The Paradise : నాని ‘ప్యారడైజ్’ రిలీజ్ పోస్ట్ పోన్?

ట్రెండింగ్‌

  • Vellulli Karam Recipe: వేడివేడి అన్నంలో నెయ్యితో ‘వెల్లుల్లి కారం’ కలిపి తింటే.. ఆ రుచే వేరప్ప..!

  • Vitamin B12 Rich Soups: విటమిన్ B12 లోపం..? ఈ సూప్‌లు తాగితే నరాలు మళ్లీ యాక్టివ్.!

  • Fatty Liver: ఇక ఫ్యాటీ లివర్ సమస్యకు చెక్.. కాలేయ ఆరోగ్యాన్ని కాపాడే 5 అద్భుత సూత్రాలు..!

  • 144Hz రిఫ్రెష్ రేట్, 7000mAh “టైటాన్ బ్యాటరీ”తో భారత్‌లో Realme NARZO 100 Lite 5G లాంచ్..!

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions