Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Amaravathi Tdp 3 0 Version Nara Lokesh Announces Major Party Reforms And Cadre Empowerment

Nara Lokesh: ఇది తెలుగుదేశం 3.0 వర్షన్.. పైరవీలతో పనిలేదు..

Published Date :April 9, 2026 , 9:28 am
By Sudhakar Ravula
Nara Lokesh:  ఇది తెలుగుదేశం 3.0 వర్షన్.. పైరవీలతో పనిలేదు..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Nara Lokesh: తెలుగుదేశం పార్టీ గ్రామస్థాయి నుంచి పొలిట్ బ్యూరో వరకు సమూల మార్పులు తీసుకువస్తోందని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తెలిపారు. ప్రతి టర్మ్‌లోనూ 33 శాతం (మూడో వంతు) కొత్తవారు ఉండాలన్నదే తమ అభిమతమని చెప్పారు. గ్రామస్థాయి నాయకుడు పొలిట్ బ్యూరో వరకు ఎదగడానికి అవకాశం ఉండాలని, మారుతున్న కాలానికి అనుగుణంగా పార్టీ పంథా మారాలని ఆయన పేర్కొన్నారు. అలాగైతేనే పార్టీ పదికాలాల పాటు ప్రజాక్షేత్రంలో నిలబడగలదని అన్నారు. తెలుగుదేశం కేడర్ శిక్షణా తరగతుల్లో భాగంగా “కాఫీ కబుర్లు” పేరుతో పార్టీ క్లస్టర్, యూనిట్, బూత్ ఇన్‌చార్జిలతో మంత్రి లోకేష్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ 3.0 వెర్షన్‌తో సరికొత్త దిశగా ముందుకు సాగుతోందన్నారు. పార్టీ కేడర్‌కు సభ్యత్వ నంబర్ ఆధార్ కార్డు లాంటిదని, ఆ నంబర్ ద్వారా ఎవరు ఎంత పని చేశారో స్పష్టంగా తెలుస్తుందని చెప్పారు. పైరవీలకు తావులేకుండా కష్టపడి పనిచేసే కార్యకర్తలను గుర్తించి పదవులు ఇస్తామని తెలిపారు. ఇటీవల పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సాధారణ కార్యకర్తలు నారా చంద్రబాబు నాయుడు పక్కన కూర్చోవడం పార్టీలో వస్తున్న మార్పులకు సంకేతమని అన్నారు.

టీడీపీ రాజకీయ విశ్వవిద్యాలయం
పార్టీని అట్టడుగు స్థాయి నుంచి బలోపేతం చేయడం, కష్టపడే కార్యకర్తలను ప్రోత్సహించడం శిక్షణా తరగతుల ముఖ్య ఉద్దేశ్యమని లోకేష్ చెప్పారు. ఇకపై క్లస్టర్, యూనిట్, గ్రామ, మండల స్థాయిల్లో ఏడాది పొడవునా శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తామని వెల్లడించారు. తెలుగుదేశం పార్టీ ఒక రాజకీయ విశ్వవిద్యాలయం లాంటిదని పేర్కొన్నారు. తెలంగాణలో ప్రస్తుత, మాజీ ముఖ్యమంత్రులతో పాటు చాలా మంది నాయకులు టిడిపి నుంచి వచ్చిన వారేనని గుర్తుచేశారు. 1989–94 మధ్య కాలంలో చంద్రబాబు ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పుడు ట్రైనింగ్ క్లాసులు నిర్వహించి కేడర్‌ను చైతన్యవంతం చేశారని తెలిపారు. అయితే పార్టీ ఆవిర్భావం తర్వాత అట్టడుగు స్థాయి నుంచి భారీ స్థాయిలో శిక్షణా తరగతులు నిర్వహించడం ఇదే మొదటిసారిగా జరుగుతోందన్నారు.

నాయకులు కాదు… పార్టీనే శాశ్వతం!
తెలుగుదేశం కేడర్ ఆధారిత పార్టీ అని, “నేనే రాజు, నేనే మంత్రి” అనే భావనను నాయకులు మార్చుకోవాలని లోకేష్ సూచించారు. పార్టీలో ఎవ్వరూ శాశ్వతం కారని, పార్టీ మాత్రమే శాశ్వతమని స్పష్టం చేశారు. సమర్థవంతమైన నాయకుడు తన తర్వాతి నాయకత్వాన్ని తయారుచేస్తాడని చెప్పారు. గతంలో వ్యక్తులను నమ్మడం వల్ల పార్టీ నష్టపోయిందని, ఇప్పుడు వ్యవస్థపై ఆధారపడి ముందుకు సాగుతున్నామని అన్నారు. 2014–19 మధ్య కాలంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినా ఓటమి పాలయ్యామని గుర్తుచేశారు. దీర్ఘకాలంగా అధికారంలో ఉండాలంటే బీజేపీని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. పార్టీ సిద్ధాంతాలను కట్టుబాటుతో అమలు చేసే క్రమశిక్షణ గల కేడర్ ఉండటమే వారి విజయ రహస్యమని అన్నారు. మై టిడిపి యాప్ మాదిరిగానే వారికి “సరళ్” యాప్ ఉందని, గ్రామస్థాయి కార్యకర్త నుంచి కేంద్ర మంత్రి వరకు బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించడం వల్లే వారు విజయవంతమవుతున్నారని వివరించారు.

మహానాడును విజయవంతం చేద్దాం
1985 తర్వాత ఎన్నడూ గెలవని మంగళగిరిని ఎంచుకుని తొలి ప్రయత్నంలో ఓడిపోయానని లోకేష్ తెలిపారు. ఐదేళ్లు కష్టపడి పనిచేసి గత ఎన్నికల్లో 91 వేలకుపైగా మెజారిటీతో గెలిచానని చెప్పారు. భారీ మెజారిటీ వచ్చినప్పటికీ, నియోజకవర్గంలోని 20 బూత్‌లలో మైనస్ రావడంతో వాటిపై దృష్టి సారిస్తున్నానని తెలిపారు. కాన్ఫిడెన్స్ ఉంటే ఏదైనా సాధ్యమని చెప్పారు. పార్టీలో సమస్యలు ఉంటే అంతర్గత వేదికల్లో చర్చించి పరిష్కరించుకోవాలని, అలిగి పక్కకు తప్పుకోవడం పార్టీకి నష్టం చేస్తుందని హెచ్చరించారు. పార్టీలో సంస్కరణల కోసం తాను చంద్రబాబుతో కూడా గట్టిగా చర్చించానని పేర్కొన్నారు. మహానాడు ఏర్పాట్లు ప్రారంభమయ్యాయని, దాన్ని విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ కష్టపడాలని పిలుపునిచ్చారు.

చంద్రబాబు నీడే మనకు శ్రీరామరక్ష
గత ఐదేళ్లలో అరాచక పాలనలో ఇబ్బందులు పడ్డామని లోకేష్ అన్నారు. దేవాలయాలపై దాడులు జరిగాయని, పార్టీ కార్యకర్తలపై దాడులు, తప్పుడు కేసులు నమోదయ్యాయని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని సమీక్షించి 60 శాతం అక్రమ కేసులను తొలగించామని చెప్పారు. మంచి రోజులు వచ్చాయని గతాన్ని మరవకూడదని, అధికారం ఉందని అహంకారం వద్దని సూచించారు. ఓర్పు, సహనంతో ముందుకు సాగాలని, నమ్మిన సిద్ధాంతాల కోసం కష్టపడాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు నాయుడు అనే మహావృక్షం నీడే మనకు రక్షణ అని పేర్కొన్నారు. నియమాలను పాటించని నాయకులకు మూడు సార్లు సూచనలు ఇస్తామని, వినకపోతే కొత్తవారికి అవకాశాలు ఇస్తామని స్పష్టం చేశారు.

జగన్‌ను సీరియస్‌గా తీసుకోవాల్సిన పనిలేదు
వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదని లోకేష్ అన్నారు. ఒకరోజు ఒకటి, మరుసటి రోజు మరోటి మాట్లాడుతున్నారని విమర్శించారు. ప్రజలకు దూరంగా ఉంటున్నారని, ఇంటి వద్ద భారీ భద్రత ఏర్పాటు చేసుకున్నారని అన్నారు. 2019లో ఓటమి తర్వాత చంద్రబాబు ప్రజల్లోనే ఉంటూ వారి సమస్యలను తెలుసుకున్నారని గుర్తుచేశారు. ఇసుక సమస్యలపై ఉద్యమాలు చేసి, కార్యకర్తలకు అండగా నిలిచారని తెలిపారు. కేడర్‌ను ఆర్థికంగా బలోపేతం చేయడానికి చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. పదవులు మాత్రమే కాకుండా అవకాశాలు అందరికీ ఉంటాయని హామీ ఇచ్చారు.

హనీమూన్ ముగిసింది… జనంలోకి వెళ్లాలి!
ప్రస్తుతం పార్టీకి “హనీమూన్ పీరియడ్” ముగిసిందని, ఇకపై ప్రతి కార్యకర్త ప్రజల్లోకి వెళ్లి పనిచేయాలని లోకేష్ పిలుపునిచ్చారు. జూన్ నుంచి ప్రభుత్వ విజయాలను ఇంటింటికీ తీసుకెళ్లే కార్యక్రమాన్ని రూపొందిస్తామని చెప్పారు. ప్రతి బూత్ కీలకమని, 94 శాతం స్ట్రైక్ రేటుతో గెలిచినా 4,600 బూత్‌లలో వెనకబడ్డామని గుర్తుచేశారు. పార్టీ బలోపేతం కోసం అహర్నిశలు కష్టపడాలని, గత మహానాడులో ఇచ్చిన ఆరు శాసనాలను అమలు చేయాలని కోరారు. కార్యకర్తే అధినేత అనే భావన ఇప్పటికే అమల్లోకి వచ్చిందని తెలిపారు. కూటమి మళ్లీ అధికారంలోకి రావడం ద్వారా అభివృద్ధి కొనసాగుతుందని, చంద్రబాబు బలంగా ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతుందని లోకేష్ పేర్కొన్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh Politics
  • ap political news
  • Chandrababu Naidu leadership
  • Nara Lokesh
  • party restructuring India

తాజావార్తలు

  • Nara Lokesh: ఇది తెలుగుదేశం 3.0 వర్షన్.. పైరవీలతో పనిలేదు..

  • Simhadri Express Train: గేదెను ఢీకొట్టిన.. పల్నాడు-సింహాద్రి ఎక్స్‌ప్రెస్ ట్రైన్..

  • India GDP Growth: భారత్‌కు గుడ్‌న్యూస్‌ చెప్పిన వరల్డ్‌ బ్యాంక్.. తగ్గేదేలే..!

  • Keralam: ఓటు హక్కు వినియోగించుకున్న సీఎం విజయన్.. ప్రముఖులు

  • Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ప్రస్తుతానికి ఒక్కటే?

ట్రెండింగ్‌

  • Kitchen Tips : వేసవిలో కిచెన్ హీట్‌కు గుడ్‌బై..! ఈ సింపుల్ టిప్స్‌తో వంటగది కూల్‌గా మార్చుకోండి.!

  • Garlic Butter Chicken Recipe : ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ గార్లిక్ బటర్ చికెన్.. ఇలా సింపుల్‌గా తయారు చేయండి..!

  • Chemical Mangoes : జాగ్రత్త..! రసాయనాలతో పండించిన మామిడి పండ్లను ఇలా గుర్తించండి..!

  • Vitamin B1 Deficiency : గర్భిణీలలో విటమిన్ బి1 లోపం.. తల్లి, బిడ్డ ఆరోగ్యానికి పొంచి ఉన్న ముప్పు.!

  • స్టైలిష్ లుక్, స్ట్రాంగ్ బిల్డ్.. యూత్‌ టార్గెట్ గా OPPO F33 సిరీస్.. ఫీచర్స్ ఇవే..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions