Tatamotors Started Vehicle Scraping Unit In Jaipur : మన దేశంలో పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడానికి ప్రభుత్వం పాత వాహనాల విషయంలో కొన్ని నిబంధనలు తీసుకువచ్చిన విషయం తెలిసిందే. అందులో భాగంగా వాహనాల స్క్రాపింగ్ పాలసీ తీసుకువచ్చింది. దీని ప్రకారం 15 ఏళ్లు పైబడిన వాణిజ్య వాహనాలు, 20 ఏళ్లు పైబడిన పర్సనల్ వెహికిల్స్ ని తుక్కు తుక్కు చేయాల్సి ఉంటుంది. దాని కోసం దేశ వ్యాప్తంగా వెహికల్ స్క్రాపింగ్ యూనిట్లను ప్రారంభిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ టాటా మోటర్స్ తన మూడో రిజిస్టర్డ్ వెహికల్ స్క్రాపింగ్ యూనిట్ ను ప్రారంభించింది.
Also Read: Laddu Chori: చార్మినార్ వద్ద వినాయకుని లడ్డూ మిస్సింగ్.. స్కూల్ కెళ్ళాల్సినోళ్ళు ఏం పనుల్రా అవి?
తొలి యూనిట్ రాజస్థాన్ లోని జైపూర్ లో, రెండో యూనిట్ ఒడిశా రాజధాని భువనేశ్వర్ లో ప్రారంభించగా తాజాగా మూడో యూనిట్ ను గుజరాత్ రాష్ట్రం సూరత్ లో ప్రారంభించింది. ఇక్కడ కమర్షియల్ తదితర వాహనాలను స్క్రాప్ చేయనున్నట్లు కంపెనీ పేర్కొంది. ఈ యూనిట్ ఏడాదికి 15 వేల వాహనాలను రీసైకిల్ చేయగలుగుతుంది. అందుకు తగ్గట్లు అన్ని ఏర్పాట్లు అందులో ఉన్నాయి. వేల సంఖ్యలో వాహనాలను తుక్కు చేసి.. రీసైక్లింగ్ చేయడమే లక్ష్యంగా పని చేస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఈ యూనిట్ స్థానికంగా కొత్త ఉద్యోగావకాశాలను సృష్టిస్తుందని టాటా మోటర్స్ వెల్లడించింది. ఇలాంటి యూనిట్లు ఏర్పాటు చేయడం వల్ల వాతావరణ కాలుష్యాన్ని కూడా తగ్గించవచ్చని నిపుణులు అంటున్నారు. ఇప్పటికే ఢిల్లీ లాంటి నగరాల్లో కాలుష్యం విపరీతంగా పెరిగిపోవడంతో పాత వాహనాలను తుక్కు కింద మార్చడాన్ని ప్రభుత్వం చాలా సీరియస్ గా అమలు చేస్తోంది. ఇలా పాత వాహనాల వల్ల విపరీతంగా వాయు కాలుష్యం ఏర్పడుతుంది.