పండగ వేళ చాలా మంది కొత్త వెహికల్ కొనాలని భావిస్తుంటారు. బైకులు, కార్లు కొనేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఇదే సమయంలో ఆటోమొబైల్ కంపెనీలు ఆఫర్ల వర్షం కురిపిస్తుంటాయి. దీంతో పండగ సీజన్ లో వాహనాల సేల్స్ రాకెట్ లా దూసుకెళ్తుంటాయి. ఈ క్రమంలో ఆటోమొబైల్ దిగ్గజం టాటామోటార్స్ పండగ సీజన్ లో అదరగొట్టింది. కేవలం 30 రోజుల్లోనే ఆటో పరిశ్రమలో కీలక మైలురాయిని సాధించింది. ఈ సమయంలో 100,000 కంటే ఎక్కువ వాహనాలను డెలివరీ చేయడం ద్వారా కంపెనీ చరిత్ర సృష్టించింది. ఇది టాటా మోటార్స్ కు మాత్రమే కాకుండా భారతీయ కార్ల మార్కెట్ కు కూడా కీలకంగా మారింది.
Also Read:CM Revanth Reddy : మావోయిస్టులకు సీఎం పిలుపు..
సెప్టెంబర్ 2025లో భారతదేశంలో నంబర్ వన్ సేల్స్ కారుగా నిలిచిన నెక్సాన్ ఒక్కటే 38,000 యూనిట్లకు పైగా అమ్ముడైంది, 73 శాతం వృద్ధిని నమోదు చేసింది. అదే సమయంలో, టాటా అత్యంత సరసమైన SUV, పంచ్, 32,000 యూనిట్ల సేల్స్ తో 29 శాతం వృద్ధిని సాధించింది అని టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ లిమిటెడ్ MD, CEO శైలేష్ చంద్ర అన్నారు. టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ విభాగంలో తన లీడర్ షిప్ ని మరింత బలోపేతం చేసుకుంది. ఈ పండుగ సమయంలో, కంపెనీ 10,000 కంటే ఎక్కువ ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయించింది. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 37% వృద్ధిని సూచిస్తుంది. ఇది దేశంలో ఎలక్ట్రిక్ మొబిలిటీపై వినియోగదారుల ఆసక్తిలో నిరంతర వృద్ధిని ప్రదర్శిస్తుంది.
Also Read:Bihar Elections 2025: బీహార్ పోరులో కొత్త ట్విస్ట్! ఎన్నికల్లో ఎంట్రీ ఇచ్చిన తాంత్రిక పూజారులు..
సెప్టెంబర్ 22 నుండి కొత్త GST మినహాయింపు ప్రయోజనాలను తమ కస్టమర్లకు నేరుగా బదిలీ చేయనున్నట్లు టాటా మోటార్స్ ప్రకటించింది. దీని ఫలితంగా కంపెనీ పోర్ట్‌ఫోలియోలోని అన్ని కార్లపై, చౌకైన టియాగో నుండి నెక్సాన్, సఫారీ వరకు రూ. 1.55 లక్షల వరకు ధరలు తగ్గాయి. GST మినహాయింపుతో పాటు, కారు కొనుగోళ్లపై రూ. 65,000 వరకు అదనపు ప్రయోజనాలు కూడా అందిస్తోంది. దీని వలన మొత్తం సేవింగ్ రూ. 2 లక్షలకు చేరుకుంది. GST మినహాయింపు, పండుగ ఆఫర్లు కంపెనీ అమ్మకాలను పెంచడంలో గణనీయమైన పాత్ర పోషించాయి.