కాంగ్రెస్ కీలక నేత మహేశ్వర్ రెడ్డి నేడు బీజేపీ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. కాంగ్రెస్‌లో ఉన్న ఆయన తెలంగా కాంగ్రెస్ నేతలపై ఢిల్లీ పెద్దలకు ఫిర్యాదు చేస్తానని వెళ్లి.. అనూహ్యంగా బీజేపీలో చేరడంతో కాంగ్రెస్‌కు షాక్ తగిలినట్లైంది. అయితే.. మహేశ్వర్ రెడ్డి బీజేపీలో చేరిన సందర్భంగా తెలంగాణ బీజేపీ ఇంచార్జీ తరుణ్ చుగ్ మాట్లాడుతూ.. బీజేపీలో మహేశ్వర్ రెడ్డి చేరారని, కాంగ్రెస్ లో కీలక నేతగా ఆయన వ్యవహరించారన్నారు. కాంగ్రెస్ కు రాజీనామా చేసి నడ్డా సమక్షంలో బీజేపీ చేరారని, మహేశ్వర్ రెడ్డి చేరిక తో బీజేపీ మరింత బలోపేతమైందన్నారు. ఈ నేపథ్యంలో బండి సంజయ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని ఇన్ని రోజులు పని చేశారని, గంట క్రితమే కాంగ్రెస్ కు రాజీనామా చేసి బీజేపీలో చేరారన్నారు. బీజేపీకి ప్రజలు అవకాశం ఇవ్వాలని చూస్తున్నారని, అందరం కలిసి కట్టుగా నియంత పాలన అంతం చేసేందుకు కృషి చేస్తామన్నారు బండి సంజయ్.
Also Read : Ajinkya Rahane: సూర్య ఢమాల్.. రహానే కమాల్.. బంపరాఫర్ పట్టేశాడుగా!
అనంతరం మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. బీజేపీలో చేరాలని రెండేళ్లుగా నాతో సంప్రదింపులు చేస్తున్నారని, కాంగ్రెస్‌లో అవమానాలు, ఇబ్బందులు.. షోకాజ్ నోటీస్ ఇవ్వడం వెనుక చాలా కారణాలు ఉన్నాయన్నారు. మోడి దేశం కోసం నిస్వార్థంగా పని చేస్తున్నారని, రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిని అంతం బీజేపీతోనే సాధ్యమన్నారు మహేశ్వర్ రెడ్డి. కాంగ్రెస్, బీఆర్ఎస్ లు కలిసి అడుగులు వేసే దిశగా ఉన్నాయని, పార్లమెంట్ లో కాంగ్రెస్ తో బీఆర్ఎస్ లు కలిసి పని చేస్తున్నాయన్నారు. పొత్తులపై ప్రతి రోజు కార్యకర్తలకు టెన్షన్ అని, కోవర్టులు ఉన్నారని నిందలు.. 15 ఏళ్లుగా పార్టీ కోసం నిబద్దతగా పని చేశా.. సోషల్ మీడియాలో అపోహలు. గంటలో రిప్లై ఇవ్వాలని షోకాజ్ నోటీసులు ఇచ్చారు.. పొగ పెట్టి పంపాలని చూశారు.. కష్టపడి పని చేస్తే.. షోకాజ్ బహుమతి ఇచ్చారు.. ఏ పని చేసినా వాళ్లకు అనుమానం.. కాంగ్రెస్ తో సమస్య లేదు.. మచ్చ లేకుండా పని చేశా.. ఉడుములా గా గాంధీ భవన్ లోకి వచ్చాడు.. సీనియర్లను బయటకి పంపిస్తున్నారు’ అంటూ మహేశ్వర్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు.
Also Read : Radhika Apte: ముక్కు సరిచేసుకో.. బ్రెస్ట్ సైజు పెంచుకోమన్నారు