టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యంగ్, టాలెంటెడ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ ఇప్పుడు తన సినిమాల కన్నా వ్యక్తిగత జీవితంతోనే వార్తల్లో నిలుస్తున్నారు. షార్ట్ ఫిల్మ్స్‌తో కెరీర్ ప్రారంభించి, ‘పెళ్లిచూపులు’తో సూపర్ హిట్ అందుకున్న ఆయన, తరువాత ‘ఈ నగరానికి ఏమైంది’, ఇటీవల ‘కీడా కోలా’ తో మరో విజయాన్ని సాధించారు. ప్రస్తుతం దర్శకుడిగానే కాకుండా నటుడిగానూ బిజీ గా కొనసాగుతున్నారు. అయితే, గత కొద్దిరోజులుగా తరుణ్ భాస్కర్ ఒక టాలీవుడ్ హీరోయిన్‌తో ప్రేమలో ఉన్నారన్న వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
Also Read : Rashmika: స్త్రీలు బలహీనులు కాదు.. వారు ఏకమైతే ఆ శక్తిని ఎవరూ ఆపలేరు: రష్మిక
ఇద్దరూ కలిసి ఉంటున్నారనీ, త్వరలో పెళ్లి కూడా చేసుకునే ప్లాన్‌లో ఉన్నారనీ టాక్ వినిపిస్తోంది. ఈ రూమర్స్ మధ్య తాజాగా ఆయన ‘రాజు వెడ్స్ రాంబాయి’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అక్కడ యాంకర్ అడిగిన ప్రశ్నకు ఇచ్చిన సమాధానం ఇప్పుడు వైరల్ అవుతుంది.‘మీరు చూసిన గ్రేట్ లవ్ స్టోరీ ఎవరిది?’ అని యాంకర్ అడగగా, తరుణ్ భాస్కర్ వెంటనే, ‘నాదే అండి నేను ఇప్పుడు లవ్‌లో ఎంజాయ్ చేస్తున్నాను. త్వరలో మా లవ్ స్టోరీనే గ్రేట్ లవ్ స్టోరీ అంటారేమో!’ అంటూ నవ్వుతూ చెప్పేశారు. దీనికి యాంకర్ కూడా, “పేరు నాకు తెలుసు కానీ బయటకి చెప్పను” అంటూ మరింత ఆసక్తికరంగా రియాక్ట్ చేసింది. దీంతో ఈ వీడియో క్షణాల్లోనే నెట్టింట వైరల్ అయిపోయింది. ఇక కొంతకాలంగా డైరెక్టర్ తరుణ్ భాస్కర్ – హీరోయిన్ ఈషా రెబ్బా లవ్‌లో ఉన్నారన్న వార్తలు తెగ హీట్ అవుతున్నాయి.
వీరిద్దరూ కలిసి నటిస్తున్న ‘ఓం శాంతి శాంతి’ (మలయాళం జయ జయహే రీమేక్) షూటింగ్ సమయంలోనే దగ్గరయ్యారనీ, అదే ప్రేమగా మారిందనే మాటలు వినిపిస్తున్నాయి. దీపావళి రోజున కూడా ఇద్దరూ కలిసి కనిపించడంతో ఆ రూమర్స్‌కు మరింత బలం చేకూరింది. అదీ కాక ఇద్దరూ వరంగల్ జిల్లాకే చెందినవారన్న విషయం కూడా ఈ టాక్‌ను ఇంకా పక్కాగా చేస్తోంది. అయితే ఈ ప్రేమ వార్తలపై తరుణ్ – ఈషా ఇద్దరూ ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి స్పందన ఇవ్వలేదు. కానీ తరుణ్ తాజా కామెంట్‌తో మాత్రం నెటిజన్లలో కొత్త కుతూహలం మొదలైంది.