Bangladesh: షేక్ హసీనాను అప్పగిస్తేనే భారత్ వస్తాడంట.. బంగ్లాదేశ్ ప్రధాని షరతు..
- బంగ్లాదేశ్ ప్రధాని తారిక్ రహ్మాన్ భారత్ పర్యటనకు ముందు ఢాకా కీలక డిమాండ్.
- షేక్ హసీనాను అప్పగించాలని కోరుతున్న బంగ్లాదేశ్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bangladesh: బంగ్లాదేశ్ ప్రధాని తారిక్ రెహ్మాన్ త్వరలో భారత్ పర్యటనకు వస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే, ఈ పర్యటనకు రావాలంటే బంగ్లాదేశ్ ఒక షరతు విధించినట్లు తెలుస్తోంది. మాజీ ప్రధాని షేక్ హసీనాను ముందు బంగ్లాదేశ్ తమకు అప్పగించాలని కోరింది. అప్పగింత ప్రక్రియపై భారత్ ముందుకు సాగకపోతే తారిక్ రెహ్మన్ న్యూఢిల్లీ పర్యటన జరిగే అవకాశం లేదని బంగ్లాదేశ్ చెప్పింది. తారిక్ రెహ్మాన్ న్యూఢిల్లీ పర్యటనపై గత కొంత కాలంగా ఇరు దేశాల అధికారులు చర్చిస్తున్నారు.
అయితే, ఆగస్టు 5న న్యూఢిల్లీలో షేక్ హసీనా బహిరంగ మీడియా కార్యక్రమం నిర్వహించడంపై బంగ్లాదేశ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది రెండు దేశాల మధ్య సంబంధాలను ప్రభావితం చేస్తుందని, ఇది తమ సార్వభౌమాధికారంపై దాడిగా అభివర్ణించింది. దీనికి ప్రతిగా షేక్ హసీనా ప్రెస్‌మీట్‌తో తమకు సంబంధం లేదని భారత్ తేల్చి చెప్పింది.
Also Read
- CPIM: అర్బన్ నక్సల్ తర్వాత దిమాగీ నక్సల్.. మోదీపై సీపీఎం ఆరోపణలు..
- Dimaagi Naxals: కిరణ్ రిజిజు ‘దిమాగీ నక్సల్స్’ లిస్ట్.. ‘‘గర్వంగా ఉంది’’ అన్న చిదంబరం
- Snake bite: కానిస్టేబుల్‌ను కాటేసిన పాము.. AI సాయంతో దక్కిన ప్రాణాలు..
- Gold Coins: మురికి కాలువలో బంగారు నాణేలు.. తవ్వుతున్న కొద్దీ దొరుకుతూనే ఉన్నాయ్..
బంగ్లాదేశ్ షేక్ హసీనాతో పాటు పరారీలో ఉన్న నిందితుల్ని త్వరగా అప్పగించాలని భారత్‌ను కోరామని, రాజకీయ కార్యకర్త షహీద్ షరీఫ్ ఉస్మాన్ హాదీ హత్య కేసులో నిందితులను కూడా ద్వైపాక్షిక అప్పగింత ఒప్పందం ప్రకారం బంగ్లాదేశ్‌కు అప్పగించాలని కోరినట్లు బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఏకేఎం షాహిదుల్ కరీమ్ చెప్పారు. బంగ్లాదేశ్‌లో సంచలనం సృష్టించిన ఉస్మాన్ హాదీ హంతకుల్ని మార్చిలో పశ్చిమ బెంగాల్ పోలీసులు ఉత్తర 24 పరగణాల జిల్లాలోని బొంగావ్ సరిహద్దు పట్టణం నుంచి అరెస్టు చేశారు.
తాజావార్తలు
-
Bangladesh: షేక్ హసీనాను అప్పగిస్తేనే భారత్ వస్తాడంట.. బంగ్లాదేశ్ ప్రధాని షరతు..
-
Mammootty: దారి తప్పిన స్టార్ హీరోకు సామాన్యుడి సాయం.. వైరల్ అవుతున్న మమ్ముట్టీ వీడియో!
-
Rocking Star Yash: యశ్‌ను పాన్ ఇండియా స్టార్ అంటూ ప్రశ్నించగా.. ఊహించని సమాధానం ఇచ్చిన రాకింగ్ స్టార్!
-
CPIM: అర్బన్ నక్సల్ తర్వాత దిమాగీ నక్సల్.. మోదీపై సీపీఎం ఆరోపణలు..
-
Rapido Driver Kidnap: ర్యాపిడో డ్రైవర్ కిడ్నాప్.. పొదల్లోకి లాక్కెళ్లి చిత్ర హింసలు..
ట్రెండింగ్
-
Bangladesh Cricket: ఆసీస్ గడ్డపై ఆస్ట్రేలియానే సుస్సు పోయించిన బంగ్లాదేశ్.. క్రికెట్ ప్రపంచం షాక్!
-
Devdutt Padikkal Record: మొదటి బ్యాటర్‌గా దేవదత్ పడిక్కల్ రేర్ రికార్డు.. గవాస్కర్, సచిన్, కోహ్లీకి కూడా సాధ్యం కాలేదు!
-
Home Hacks : గోడలపై ఫర్నిచర్ మరకలకు చెక్.. ఇంట్లోనే పాటించాల్సిన సులువైన చిట్కాలు.!
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్‌రేంజ్‌లో బెస్ట్ స్మార్ట్‌ఫోన్ ఏది.?