Virat Kohli: విరాట్ కోహ్లీని అక్కడే టార్గెట్ చేయండి.. ఆస్ట్రేలియా బౌలర్లకు హీలీ సూచన!
- మరో రెండు రోజుల్లో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ప్రారంభం
- విరాట్ కోహ్లీ అత్యంత కీలకం
- ఇయాన్ హీలీ కీలక సూచనలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య మరో రెండు రోజుల్లో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25 ప్రారంభం కానుంది. నవంబర్ 22 నుంచి పెర్త్ వేదికగా తొలి టెస్ట్ ప్రారంభం అవుతుంది. ఈ ట్రోఫీలో భారత జట్టుకు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అత్యంత కీలకం కాబోతున్నాడు. న్యూజీలాండ్ సిరీస్‌లో విఫలమయినా.. ఆసీస్ అంటే మాత్రం విరాట్ రెచ్చిపోతాడు. అందుకే ఆస్ట్రేలియా దృష్టంతా కోహ్లీపైనే ఉంది. ఈ నేపథ్యంలో కోహ్లీని అడ్డుకునేందుకు ఆసీస్ బౌలర్లకు ఆస్ట్రేలియా మాజీ వికెట్‌కీపర్ ఇయాన్ హీలీ కీలక సూచనలు చేశాడు. కింగ్ ఫ్రంట్ ప్యాడ్లను టార్గెట్ చేయాలని చెప్పాడు.
సెన్ రేడియోతో ఇయాన్ హీలీ మాట్లాడుతూ… ‘ఆస్ట్రేలియా పేసర్లు విరాట్ కోహ్లీకి ఎలా బౌలింగ్ చేస్తారన్నది చూడాలి. విరాట్ ఫ్రంట్ ప్యాడ్లను టార్గెట్ చేయాలి. ప్రతి బంతికీ అలా చేస్తే.. అతడు అలవాటు పడతాడు. ఎప్పుడో ఒకసారి ప్యాడ్లను టార్గెట్ చేస్తూ బంతులేస్తే ఫలితం ఉంటుంది. ఆ వ్యూహం ఫలించకపోతే.. అప్పుడు దేహాన్ని లక్ష్యంగా చేసుకోవాలి. కుడి భుజంకు బంతులేయాలి. కోహ్లీని గాల్లో ఎగిరేలా చేయాలి. బంతి నుంచి తప్పించుకోవడానికి కిందికి, వెనక్కి వంగేలా చేయాలి. అతడి కోసం ప్రత్యేకంగా షార్ట్ లెగ్‌లో ఫీల్డర్‌ను ఉంచాలి’ అని చెప్పాడు.
Also Read
- Gunasekhar: అలా పుట్టిందే 'ఒక్కడు' సినిమా.. డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు.!
- Varanasi: రాముడు vs కుంభకర్ణుడు.. ఆ 30 నిమిషాల సీక్వెన్స్ ఆడియన్స్‌కు మైండ్ బ్లాకే.! జక్కన్న స్క్రిప్ట్ మాములుగా లేదుగా.!
- TMC Rebellion: కోల్‌కతా టు ఢిల్లీ.. పార్లమెంట్‌కు పాకిన టీఎంసీ తిరుగుబాటు సెగ.. దీదీకి తప్పని అగ్నిపరీక్ష!
- Delhi: అభిజీత్ దిప్కే పిలుపునకు భారీ స్పందన.. ‘కాక్రోచ్ మాస్కులు’ ధరించి నిరసన బాట పట్టిన యువత..
Also Read: AUS vs IND: ఫైర్ లేదు.. కేఎల్ రాహుల్ ఓపెనర్‌గా వద్దు!
విరాట్ కోహ్లీతో ఎప్పుడూ ఘర్షణ పడొద్దని ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు షేన్ వాట్సన్ ఆ టీమ్ ఆటగాళ్లకు సూచించాడు. ‘విరాట్ కోహ్లీ గురించి ఓ విషయం నాకు స్పష్టంగా తెలుసు. అతడితో ఎప్పుడూ ఘర్షణ పడొద్దు. ఎంత రెచ్చగొడితే అంత తీవ్రతతో, అంత బాగా ఆడతాడు. అతడిలో నిత్యం జ్వాల రగులుతూ ఉంటుంది. ప్రతి బంతినీ తీవ్రతతో ఆడతాడు. అయితే ఇటీవల కాలంలో కోహ్లీలో జ్వాల కాస్త తగ్గింది. ఏ ప్లేయర్ అయినా ఆటలో అదే తీవ్రతను ప్రతి నిమిషమూ కొనసాగించడం కష్టం. ఈ విషయంలో ఆస్ట్రేలియా చాలా జాగ్రత్తగా ఉండాలి’ అని వాట్సన్ సూచించాడు.
తాజావార్తలు
-
Gunasekhar: అలా పుట్టిందే ‘ఒక్కడు’ సినిమా.. డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు.!
-
Ramcharan New Record : “పెద్ది”తో రామ్ చరణ్ సరికొత్త రికార్డు… ఆ ఘనత సాధించిన సౌత్ స్టార్స్ వీళ్ళే
-
Varanasi: రాముడు vs కుంభకర్ణుడు.. ఆ 30 నిమిషాల సీక్వెన్స్ ఆడియన్స్‌కు మైండ్ బ్లాకే.! జక్కన్న స్క్రిప్ట్ మాములుగా లేదుగా.!
-
TMC Rebellion: కోల్‌కతా టు ఢిల్లీ.. పార్లమెంట్‌కు పాకిన టీఎంసీ తిరుగుబాటు సెగ.. దీదీకి తప్పని అగ్నిపరీక్ష!
-
Today Gold and Silver Prices: పసిడి ధరలో భారీ పతనం.. వెండి కూడా చౌకైంది.. 22, 24 క్యారెట్ ధరలు ఎంతంటే?
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!