దేశంలో టమోటాల ధరలు మండిపోతున్నాయి.. ఇప్పుడిప్పుడే ధరలు కిందకు దిగి వస్తున్నాయి.. పెద్ద పెద్ద రెస్టారెంట్ లు సైతం టమోటా లను అడగొద్దు అంటూ బోర్డులు పెట్టేస్తున్నారు.. అలాంటి ఈరోజుల్లో ఓ వింత ఐస్ క్రీమ్ జనాలకు కోపాన్ని తెప్పిస్తుంది. ఆ ఐస్ క్రీమ్ ను టమోటాలతో తయారు చేశారు.. అంతేకాదు ధర కూడా ఎక్కువే.. ఈ ఐస్ క్రీమ్ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..
టమాటా రేట్లు విపరీతంగా పెరిగిపోయాయి. సామాన్యుడు టమాటాను మర్చిపోయి చాలా రోజులు అవుతోంది. టమాటా కొనుగోలు చేసినా చాలా పొదుపుగా వాడాల్సిన పరిస్థితి. ఆగస్టు నెలాఖరుకి ఈ రేట్లు మరింత పెగవచ్చనే ప్రకటనలతో వినియోగదారులు ఠారెత్తిపోతున్నారు. ఓవైపు టమాటా దొంగతనాలు పెరిగిపోవడంతో రైతులు తమ పొలాలకు రక్షణ చర్యలు చేపట్టారు. సీసీ కెమెరాలు కూడా పెడుతున్నారు. పిల్లల పుట్టినరోజు సందర్భాల్లో టమాటాలు బహుమతులుగా కూడా ఇస్తున్నారు. టమాటాలపై రీల్స్, వీడియోలు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్నాయి..
ఇప్పుడు తాజాగా మరో వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. అదేనంటే టమాటా ఐస్ క్రీం.. టమోటాలు రుచికి పుల్లగా ఉంటాయి.. అలాంటిది వాటితో టమోటాలను ఎలా చేస్తారు అని కొందరు ప్రశ్నలు కురిపిస్తున్నారు.. మరికొంతమంది మాత్రం ఎలా చేస్తారు అంటూ షాకింగ్ కామెంట్స్ చేస్తున్నారు.. ఈ కొత్త కాంబినేషన్ ఎలా ఉంటుందో అని ఆందోళన వ్యక్తం చేశారు. చాలామంది ప్రస్తుతం ఇండియాలో చాలా ఎక్స్‌పెన్సివ్ ఐస్ క్రీం ఇదే అంటూ కామెంట్ చేశారు. చాలామంది ఈ కాంబినేషన్‌ను విమర్శించారు. ఇకపోతే ప్రస్తుతం టమోటాల ధరలు తగ్గినట్లు తెలుస్తుంది.. ఏది ఏమైనా మొత్తానికి ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. మీరు కూడా ఒక లుక్ వేసుకోండి..