Tamil Nadu: గవర్నర్ మళ్లీ ట్విస్ట్.. విజయ్‌కు నో అపాయింట్‌మెంట్.. వెనక్కి వెళ్లిపోయిన టీవీకే అధినేత
- తమిళనాడు గవర్నర్ మళ్లీ ట్విస్ట్
- విజయ్‌కు నో అపాయింట్‌మెంట్
- వెనక్కి వెళ్లిపోయిన టీవీకే అధినేత
- గవర్నర్ తీరుపై మండిపడుతున్న అభిమానులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళనాడు గవర్నర్ అర్లేకర్ మళ్లీ విజయ్‌కు ట్విస్ట్ ఇచ్చారు. ఇప్పటి దాకా మ్యాజిక్ ఫిగర్ లేదని మూడు సార్లు వెనక్కి పంపిన గవర్నర్.. తాజాగా సంపూర్ణ బలం వచ్చాక కలిసేందుకు నిరాకరించారు. గవర్నర్‌ను కలిసేందుకు లోక్‌భవన్‌కు వెళ్లిన విజయ్‌కు చేదు అనుభవం ఎదురైంది. గవర్నర్ అయిపాయింట్ ఇవ్వకపోవడంతో లోక్‌భవన్ దాకా వెళ్లి తిరిగి టీవీకే కార్యాలయానికి వచ్చేశారు.
ఈ రాత్రి 7:30కు కేరళం వెళ్లేందుకు గవర్నర్ అర్లేకర్ ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే ముందస్తు అపాయింట్‌మెంట్లు ఉండడంతో విజయ్‌కు అపాయింట్‌మెంట్ ఇవ్వలేకపోయినట్లుగా లోక్‌భవన్ కార్యాలయం చెబుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ పరిణామంపై టీవీకే అభిమానులు, నేతలు మండిపడుతున్నారు. గవర్నర్ కావాలనే గేమ్ ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Also Read
తాజాగా విజయ్ బలం వీసీకే, ముస్లిం లీగ్ పార్టీల మద్దతు 120కి చేరింది. ఆ పార్టీలు సంపూర్ణ మద్దతు తెల్పాయి. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం అయిందని అంతా భావించారు. కానీ చివరి నిమిషంలో విజయ్‌కు అపాయింట్‌మెంట్ నిరాకరించడంతో అంతా అవాక్కయ్యారు.
తాజావార్తలు
-
Tamil Nadu: గవర్నర్ మళ్లీ ట్విస్ట్.. విజయ్‌కు నో అపాయింట్‌మెంట్.. వెనక్కి వెళ్లిపోయిన టీవీకే అధినేత
-
Ambati Rambabu : రాష్ట్రంలో దౌర్భాగ్యమైన పాలన సాగుతోంది.. చంద్రబాబువి గారడీ విద్యలు
-
PM Modi Hyderabad Tour: ప్రధాని మోడీ సభకు సర్వం సిద్ధం.. పరేడ్ గ్రౌండ్స్ చుట్టూ పోలీసుల రక్షణ వలయం!
-
Ashu Reddy : అషు రెడ్డి ఎంగేజ్‌మెంట్ వెనుక అసలు నిజం గుట్టు రట్టు!
-
Tamil Nadu: ఈ రాత్రికి కేరళం వెళ్లిపోనున్న గవర్నర్.. విజయ్ ప్రమాణస్వీకారంపై సర్వత్రా ఉత్కంఠ!