Ashu Reddy : అషు రెడ్డి ఎంగేజ్‌మెంట్ వెనుక అసలు నిజం గుట్టు రట్టు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బిగ్‌బాస్ బ్యూటీ, సోషల్ మీడియా సెన్సేషన్ అషురెడ్డి వ్యవహారం ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. ఒకవైపు ఎన్నారైని పెళ్లి పేరుతో మోసం చేశారనే కేసులో చిక్కుకున్న ఆమె.. సడెన్‌గా ఎంగేజ్‌మెంట్ చేసుకున్నట్టు హింట్ ఇస్తూ షేర్ చేసిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కోర్టు షాక్ ఇచ్చిన కొద్ది గంటల్లోనే ఆమె నిశ్చితార్థం వార్తలు బయటకు రావడంతో నెటిజన్లు ఒక్కసారిగా విస్మయానికి గురయ్యారు. అయితే, ఆ ఫొటోల వెనుక ఉన్న అసలు కథ వేరే ఉంది. ఎన్నారై వ్యాపారవేత్తను పెళ్లి పేరుతో మోసం చేశారనే ఆరోపణలు అషురెడ్డితో పాటు ఆమె తల్లి యశోదరెడ్డిపై ఉన్న సంగతి తెలిసిందే. ఈ కేసు దర్యాప్తును నిలిపివేయాలని (స్టే ఇవ్వాలని) కోరుతూ వారు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. అయితే, న్యాయస్థానం వారికి గట్టి షాక్ ఇచ్చింది. దర్యాప్తుపై స్టే ఇచ్చేందుకు నిరాకరించిన కోర్టు.. పోలీసుల కఠిన చర్యల నుంచి మినహాయింపు (ముందస్తు రక్షణ) కల్పించేందుకు కూడా ససేమిరా అంది.
హైకోర్టు తీర్పుతో అషురెడ్డి తీవ్ర ఒత్తిడిలో ఉందని, తదుపరి యాక్షన్ ప్లాన్ ఏంటని అంతా భావిస్తున్న తరుణంలో.. ఆమె ఎంగేజ్‌మెంట్ ఫొటోలు బయటకు రావడం సంచలనంగా మారింది. కేసుల నుంచి జనాల దృష్టి మళ్లించడానికే ఈ పెళ్లి ప్లాన్ అంటూ సోషల్ మీడియాలో రకరకాల కామెంట్లు వినిపించాయి. కానీ, అషురెడ్డికి ఎలాంటి ఎంగేజ్‌మెంట్ కాలేదు! ఆ వైరల్ అవుతున్న ఫొటోలు ఆమె నిజ జీవితానికి సంబంధించినవి కావు. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘జియో హాట్‌స్టార్’ కోసం అషురెడ్డి ప్రస్తుతం ఒక వెబ్ సిరీస్‌లో నటిస్తోంది. ఆ సిరీస్ షూటింగ్‌లో భాగంగా తెరకెక్కించిన నిశ్చితార్థం సన్నివేశాలకు సంబంధించిన ఫొటోలే ఇవి. ఆమె కావాలనే మిస్ లీడ్ చేసేందుకు సోషల్ మీడియాలో షేర్ చేసినట్టు అనిపిస్తోంది. అందుకే కళ్ళతో చూసేవన్నీ నిజం కాదని ఆమె సోషల్ మీడియాలో రాసుకొచ్చింది.
Also Read
- Vishwanath & Sons : 4 రోజుల్లో ₹150 కోట్ల మార్క్ దాటిన 'విశ్వనాథ్ & సన్స్'!
- Varanasi: ‘వారణాసి’పై జక్కన్న మరో క్రేజీ ప్లాన్.. షూటింగ్ వెనుక సీక్రెట్స్ అన్నీ బయట పెడతాడట?
- OG 2 నుంచి వరుస ట్రీట్స్.. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు మాస్ కిక్ స్టార్ట్!
- The Revolutionaries OTT: బ్రిటిష్ సామ్రాజ్యాన్ని వణికించిన నలుగురు వీరులు.. ఓటీటీలోకి హై-వోల్టేజ్ పీరియడ్ యాక్షన్ సిరీస్
తాజావార్తలు
-
Vande Mataram Row: ‘‘మహాత్మా గాంధీపై కూడా కేసు పెట్టాలి’’.. వందేమాతరం వివాదంపై ఖర్గే..
-
Vishwanath & Sons : 4 రోజుల్లో ₹150 కోట్ల మార్క్ దాటిన ‘విశ్వనాథ్ & సన్స్’!
-
Jio Prime Membership: జియో ప్రైమ్‌పై పెరుగుతున్న సందేహాలు.. రూ.299, రూ.300 మధ్య తేడా ఏంటి? క్లారిటీ ఇదే..
-
NTR Trivikram: రెండు టైటిళ్లను రిజిస్టర్ చేయించిన ఎన్టీఆర్ ఆర్ట్స్
-
Twisha Sharma: ట్విషా శర్మది హత్యా.. ఆత్మహత్యా? సీబీఐ ఏం తేల్చిందంటే..!
ట్రెండింగ్
-
Devdutt Padikkal: దేవదత్ పడిక్కల్ అరుదైన ఘనత.. పుజారా కూడా సాధించలేని రికార్డు భయ్యో!
-
మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 144Hz AMOLED డిస్ప్లే, 6500mAh బ్యాటరీతో POVA 8 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
165Hz డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR Pad 20 Pro Paperlike Edition లాంచ్..!
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 10,000mAh బ్యాటరీతో ఆగస్టు 27న రాబోతున్న Redmi Note 17 Pro Max 5G.. ఫీచర్లు ఇవే..!
-
Harry Brook-IPL: ఐపీఎల్ అంటేనే భయమేసింది.. డిప్రెషన్లోకి వెళ్లా.. ఇంగ్లండ్ స్టార్ సంచలన వ్యాఖ్యలు!