UP: రేపే యోగి కేబినెట్ విస్తరణ.. ఎన్నికల వేళ కొత్త ముఖాలకు ఛాన్స్!
- రేపే యూపీ కేబినెట్ విస్తరణ
- ఎన్నికల వేళ కొత్త ముఖాలకు ఛాన్స్!
- మరోసారి అధికారం కోసం యోగి సర్కార్ ప్రయత్నం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వచ్చే ఏడాది ప్రారంభంలోనే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మరోసారి అధికారం కోసం బీజేపీ ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ముచ్చటగా మూడోసారి అధికారాన్ని ఛేజిక్కించుకునేందుకు పావులు కదుపుతోంది. ఈ ప్రణాళికలో భాగంగానే ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మంత్రివర్గ విస్తరణకు సిద్ధమయ్యారు. ఆదివారం కేబినెట్ విస్తరణ జరగనుంది. అయితే విస్తరణలో కొత్త వారికే అవకాశం ఇవ్వొ్చ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం బీజేపీ మంచి జోష్‌లో ఉంది. పశ్చిమ బెంగాల్‌లో తొలిసారి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. బీహార్‌లో కూడా సమ్రాట్ చౌదరి నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది. ఇలాంటి తరుణంలో మరోసారి ఉత్తరప్రదేశ్‌లో అధికారాన్ని నిలబెట్టుకునేందుకు ఇప్పటి నుంచే బీజేపీ పావులు కదుపుతోంది. ఇందులో భాగంగానే ఆదివారం యోగి కేబినెట్ విస్తరణకు పూనుకున్నారు. విస్తరణలో ఆరుగురు కొత్త ముఖాలకు అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
Also Read
- Ketan Agarwal Case: కేతన్ హత్య 5 వేల పేజీల ఛార్జిషీట్.. పిచ్చిగా ప్రేమించిన కేతన్, హత్య చేసిన సియా..
- Student Protests: రేప్ నుంచి దెయ్యం వరకు.. పుకార్లతో రగిలిపోతున్న యూనివర్సిటీలు.!
- Kaveri Engine: రష్యాలో ‘‘కావేరి ఇంజన్’’ సత్తా.. భారత స్వేదేశీ ఇంజన్ సిద్ధం.!
- Congress: ప్రధాని మోదీ, జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలి.. సీడబ్ల్యూసీలో కాంగ్రెస్ 5 డిమాండ్లు..
ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ శనివారం సాయంత్రం గవర్నర్ ఆనందీబెన్ పటేల్‌తో సమావేశం కానున్నారు. ఈ సమావేశం సాయంత్రం 6:30 గంటలకు జరగనుంది. ఈ సమావేశంలో మంత్రివర్గ విస్తరణపై చర్చించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వంలో ప్రస్తుతం మొత్తం 54 మంది మంత్రులు ఉన్నారు. వీరిలో 21 మంది కేబినెట్ మంత్రులు, 14 మంది స్వతంత్ర బాధ్యతలు కలిగిన సహాయ మంత్రులు, 19 మంది సహాయ మంత్రులు ఉన్నారు. రాష్ట్రంలోని 403 అసెంబ్లీ స్థానాలకు గరిష్టంగా 60 మంది మంత్రులకు అవకాశం ఉంది. ఆరు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఈ ఖాళీ స్థానాలను కొత్త మంత్రులతో భర్తీ చేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.
తాజావార్తలు
-
Ketan Agarwal Case: కేతన్ హత్య 5 వేల పేజీల ఛార్జిషీట్.. పిచ్చిగా ప్రేమించిన కేతన్, హత్య చేసిన సియా..
-
Explainer: మరిన్ని విపత్తులు తప్పవా?
-
Lava Smart Phone: 6000mAH బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్.. లావా నుంచి బడ్జెట్ ధరలో స్మార్ట్ ఫోన్ లాంచ్..
-
JNTU Sultanpur : జేఎన్టీయూ కాలేజీలో ర్యాగింగ్ కలకలం.. ఇద్దరు సీనియర్లు సస్పెండ్
-
Student Protests: రేప్ నుంచి దెయ్యం వరకు.. పుకార్లతో రగిలిపోతున్న యూనివర్సిటీలు.!
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!