Vijay TVK Party: తమిళనాడులో హంగ్ దిశగా ఫలితాలు.. ఆ పార్టీతో టీవీకే విజయ్ పొత్తు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vijay TVK Party: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల (2026) కౌంటింగ్ ఉత్కంఠభరితంగా సాగుతోంది. నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కజగం (TVK) తొలి ప్రయత్నంలోనే ప్రభంజనం సృష్టిస్తూ 100కు పైగా స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండటంతో చెన్నై రాజకీయ వర్గాల్లో ఒక్కసారిగా పొత్తుల చర్చ మొదలైంది. ఇక విజయ్ ఏ పార్టీతో కలుస్తారు? ఎవరితో పొత్తు పెట్టుకుంటారు? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ముఖ్యంగా అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకునే అవకాశం ఉందనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే, గత కొన్ని నెలలుగా అటు ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (AIADMK), ఇటు టీవీకే మధ్య జరిగిన మాటల యుద్ధం, పరస్పర విమర్శల నేపథ్యంలో ఈ రెండు పార్టీల మధ్య పొత్తు అనేది అంత సులభంగా కనిపించడం లేదు. ప్రస్తుతం వస్తున్న ఫలితాలు ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ ఇవ్వని పక్షంలో (Fractured Verdict), అధికారం కోసం పాత విభేదాలను పక్కన పెట్టి కొత్త సమీకరణాలు పుట్టుకొచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
గత ఏడాది (2025) చివరలో అన్నాడీఎంకే, విజయ్ పార్టీతో పొత్తు కోసం అనధికారికంగా ప్రయత్నాలు చేసినట్లు సమాచారం. అయితే, విజయ్ పెట్టిన కఠిన నిబంధనల వల్ల ఆ చర్చలు విఫలమయ్యాయి. కూటమికి నాయకత్వం వహించడం, తననే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించడం, సగానికి పైగా సీట్లు (117+) కేటాయించడం వంటి డిమాండ్లను విజయ్ ముందుంచినట్లు తెలుస్తోంది. దశాబ్దాలుగా రాష్ట్రాన్ని ఏలిన అన్నాడీఎంకే, ఒక కొత్త పార్టీకి అంతటి ప్రాధాన్యత ఇవ్వడానికి అప్పట్లో సిద్ధపడలేదు. ఫలితంగా చర్చలు బెడిసికొట్టాయి.
Also Read
- SA VS AUS: 10 ఏళ్ల కష్టానికి ఫలితం.. పాయింట్స్ టేబుల్ టాప్‌లోకి దూసుకెళ్లిన దక్షిణాఫ్రికా..
- Trafficking: ఫెర్టిలిటీ సెంటర్లలో త్వరలోనే తనిఖీలు.. కఠిన చర్యలకు మల్కాజ్గిరి సీపీ హెచ్చరిక..
- Rapthadu Attack: రాప్తాడు ఘటన.. గాయపడిన విద్యార్థినికి మెరుగైన వైద్యం కోసం బెంగళూరు తరలింపు..
- Eggs Collection: ఒక్కో యువతికి రూ.30 వేలు ఇచ్చి అండాల సేకరణ.. హైదరాబాద్‌లో వెలుగులోకి కొత్త మాఫియా..
కానీ, ఇప్పుడు ఫలితాలు చూస్తుంటే విజయ్ ఒక బలమైన శక్తిగా ఎదిగారు. ప్రస్తుత ట్రెండ్స్ ప్రకారం టీవీకే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించే అవకాశం కనిపిస్తోంది. ఒకవేళ ఏ కూటమికీ 118 సీట్లు రాకపోతే, అప్పుడు AIADMK-TVK కలవక తప్పని పరిస్థితి ఏర్పడవచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే ఇది జరగాలంటే రెండు వైపుల నుంచి పెద్ద త్యాగాలే చేయాల్సి వస్తుంది. విజయ్ నాయకత్వాన్ని ఎడప్పాడి అంగీకరించాల్సి ఉంటుంది, అలాగే “ఒంటరి పోరాటం” అని నినదించిన విజయ్ తన మాటను వెనక్కి తీసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు అది రాజకీయ ఆశావాదం కంటే, అధికార అవసరం కోసం ఏర్పడే కూటమిగానే మిగిలిపోతుంది.
తాజావార్తలు
-
Irumudi : ‘ఇరుముడి’ నిర్మాతలకు తెలంగాణ లేబర్ డిపార్ట్మెంట్ షాక్.. ఆ 20 శాతం డబ్బు ఏమైంది?
-
SA VS AUS: 10 ఏళ్ల కష్టానికి ఫలితం.. పాయింట్స్ టేబుల్ టాప్‌లోకి దూసుకెళ్లిన దక్షిణాఫ్రికా..
-
Srikaanth Odela: విభజన నేపథ్యంతో కొత్త లవ్ స్టోరీ.. శ్రీకాంత్ ఓదెల నయా ప్లాన్!
-
Scene Trailer: సైకో కిల్లర్‌తో మాజీ కాప్ ఆట.. సూర్య ‘సీన్’ ట్రైలర్ చూశారా?
-
Arjuna: పవన్ కళ్యాణ్‌తో దిల్ రాజు పాన్-ఇండియా మూవీ.. టైటిల్ ఇదేనట?
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!