దక్షిణాది చిత్ర పరిశ్రమ లో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకుని స్టార్ హీరోయిన్‍గా దూసుకుపోతోంది తమన్నా.. ఈ భామ హ్యాపీడేస్ సినిమాతో తెలుగు లో మంచి విజయం అందుకొని అప్పటి నుంచి వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందింది.ప్రస్తుతం తమన్నా సౌత్ మరియు నార్త్ ఇండస్ట్రీ లలో సినిమాలు మరియు వెబ్ సిరీస్ లు చేస్తూ ఎంతో బిజీగా ఉంది.ఈ భామ ఇటీవలే జైలర్, భోళా శంకర్ సినిమాలలో నటించి మెప్పించింది.అలాగే బాలీవుడ్ లో లస్ట్ స్టోరీస్ 2, జీ కర్దా వంటి వెబ్ సిరీస్ లలో బోల్డ్ గా నటించి అందరినీ ఆశ్చర్య పరిచింది.అలాగే ఆఖరి సచ్ అనే మరో వెబ్ సిరీస్‍తో మరో సారి ఓటీటీలో సందడి చేస్తోంది.ఇదిలా ఉంటే భారత్‌లో కాస్మోటిక్స్ బాగా డిమాండ్ ఉండటంతో కాస్మోటిక్ రంగం బాగా వృద్ధి చెందింది.. ఇటీవల కాంటార్ వరల్డ్ ప్యానెల్ నివేదికలో ఈ ఏడాది భారతీయ మహిళలు తొలి ఆరు నెలల కాలంలో లిప్‌స్టిక్ మరియు నెయిల్ పాలిష్ నుంచి ఐలైనర్ వరకు 100 మిలియన్లకు పైగా కాస్మోటిక్ ప్రోడక్ట్స్ కొన్నారు.
దీంతో కాస్మోటిక్స్ సంస్థలు రూ. 5 వేల కోట్ల ఆదాయాన్ని గడించాయి.ఇలా బ్యూటి ఉత్పత్తుల కోసం మహిళలు సగటున రూ. 1, 214 ఖర్చు చేయగా.. అందులో దాదాపుగా 40 శాతం ఆన్‌లైన్ ద్వారా కొనుగోలు చేసినవే అని ఎకనామిక్ టైమ్స్ పేర్కొంది.ఇలాంటి సమయంలో భారతీయ మహిళలను ఆకట్టుకునేందుకు కొన్ని కాస్మోటిక్ సంస్థలు స్టార్ హీరోయిన్లను తమ బ్రాండ్ అంబాసిడర్లుగా నియమించుకుంటున్నాయి. ఇటీవల వెబ్ సిరీసుల్లో బోల్డ్ సీన్లతో తమన్నా బాగా పాపులర్ అయింది. దీంతో తమన్నాను జపాన్ కాస్మోటిక్ దిగ్గజం షిసిడో భారత్ అంబాసిడర్‌గా నియమించింది. అయితే భారత్ నుంచి ఇప్పటివరకు ఏ హీరోయిన్ షిసిడోకు ప్రచారకర్తగా చేయలేదు.దీనితో షిసిడో బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపిక కావడంపై తమన్నా సంతోషం వ్యక్తం చేసింది. అలాగే ఆశ్చర్యం వ్యక్తం చేసింది.ఇక షిసిడో సంస్థ 100 ఏళ్లకు పైగా కాస్మోటిక్ రంగంలో అగ్రగామిగా కొనసాగుతోంది. తమన్నా-షిసిడో ఒప్పందం భారత్ ఎంటర్టైన్ మెంట్ తో పాటు కాస్మోటిక్ రంగంలో రాణించేందుకు ఉపయోగపడుతుందని షిసిడో భావిస్తున్నట్లు సమాచారం. దీనితో తమన్నా మరింతగా పాపులర్ అవుతుందని తెలుస్తుంది.