Site icon NTV Telugu

TPCC Mahesh Goud : దిక్కుతోచని స్థితిలో కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌కి పరిమితమయ్యారు

Mahesh Goud

Mahesh Goud

TPCC Mahesh Goud : ఎమ్మెల్సీ కవిత మాజీ సీఎం కేసీఆర్‌కు రాసిన లేఖ వ్యవహారం తెలంగాణలో హాట్‌ టాపిక్‌ గా మారింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎఎస్‌, కాంగ్రెస్‌ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ క్రమంలోనే టీపీసీసీ చీఫ్‌ మహేష్‌ కుమార్‌ గౌడ్‌ మాట్లాడుతూ ఇంట్లో కుంపటి తట్టుకోలేక కేటీఆర్ సతమతం అవుతున్నాడని, ఎకు మేకై మరో పవర్ సెంటర్ రావడంతో మతిభ్రమించి, రేవంత్ రెడ్డి పైన కేటీఆర్ మాట్లాడారని ఆయన మండిపడ్డారు. కవిత ఎపిసోడ్ ను డైవర్ట్ చేయడానికి కేటీఆర్, సీఎం రేవంత్ పై ఆరోపణలు చేశాడని, కేటీఆర్ ముందు ఇంట్లో రగులు నాకు ఇప్పటిని సరిపెట్టుకోవాలన్నారు మహేష్ గౌడ్‌. పది సంవత్సరాల టిఆర్ఎస్ తప్పిదాలను కవిత తప్పులను ఎత్తి చూపిందని, టీఆర్ఎస్ తప్పిదాలన్ని ప్రజలకు అర్థమవుతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు.

Covid Cases: భారత్‌ను బెంబేలెత్తిస్తున్న కరోనా.. కేరళ, ముంబై, ఢిల్లీలో పెరిగిన కేసులు

అంతేకాకుండా..కాలేశ్వరం అవినీతిలో కేసీఆర్‌కు నోటీసులతో, కేటీఆర్ భయపడుతున్నాడని, బీఆర్ఎస్ కు, బీజేపీకి స్పష్టమైన అవగాహన ఉన్నట్లు కవిత వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయని, బిఆర్ఎస్ మూడు ముక్కలు కాబోతుందన్నారు మహేష గౌడ్‌. కవిత, కేటీఆర్ మధ్య పోటీ తీవ్రం కావడంతో అదును కోసం హరీష్ రావు ఎదురు చూస్తున్నారని, దిక్కుతోచని స్థితిలో కెసిఆర్ ఫామ్ హౌస్ కి పరిమితమయ్యారన్నారని ఆయన విమర్శించారు. కేసీఆర్ చుట్టూ ఉన్న దయ్యాలు ఎవరో ప్రజలకు తెలియాలని, పదేళ్ల అవినీతిలో పంపకాల్లో వచ్చిన తేడాతోనే, కవిత జెండా ఎగరవేసినట్లు అర్థమవుతుందన్నారు. భవిష్యత్తు తెలంగాణ రాజకీయ ముఖచిత్రంలో బీఆర్ఎస్ ఉండదని ఆయన వ్యాఖ్యానించారు.

Anusree Satyanarayana: పవన్ సినిమా ఆపే ధైర్యం ఎవరికి లేదు.. ఏపీలో సినిమా థియేటర్ల బంద్ లేదు..

Exit mobile version