Site icon NTV Telugu

Harish Rao : సీఎం రేవంత్‌ రెడ్డికి హరీష్‌ రావు లేఖ

Harish Rao

Harish Rao

Harish Rao : అంగన్వాడీ ఉద్యోగుల జీతాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న వ్యవహారంపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి宀కు ఆయన బహిరంగ లేఖ రాశారు. అంగన్వాడీలుగా గుర్తించి ఏడాది గడుస్తున్నా, వేతనాల పెంపు మాట మరిచిన ప్రభుత్వం తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ హయాంలో ఇచ్చిన జీవోను కాపీ కొట్టి ప్రచారం చేసుకున్నదని, కానీ వాస్తవంగా మూడు నెలలకే పెరిగిన జీతం చెల్లించి మిగతా నెలలంతా పాత జీతానికే పనులు చేయిస్తున్నారని హరీష్ రావు విమర్శించారు. ఉద్యోగుల జీతాన్ని ₹13,650 నుంచి ₹7,800కి తగ్గించడాన్ని ఆయన దారుణమని ఆయన అభివర్ణించారు.

Government Land Encroached: మాజీ మంత్రి కబ్జా చేసిన ప్రభుత్వ భూమి స్వాధీనం..!

పెంచిన జీతాలను తగ్గించే కొత్త సాంప్రదాయం దేశంలో ఎక్కడా ఉండదని, ఇది తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన ఘోర పద్ధతి అని హరీష్ రావు మండిపడ్డారు. గ్రామీణ ప్రాంతాల్లో పని చేస్తున్న మహిళలపై ఈ తీరుతో తీవ్ర ఆర్థిక భారం పడుతోందని అన్నారు. మే నెల జీతాన్ని రాష్ట్రంలోని కేవలం 8 జిల్లాల్లో మాత్రమే చెల్లించడం, మిగతా జిల్లాల ఉద్యోగులను విస్మరించడం దారుణమని అన్నారు. లేఖలో జనవరి 2024 నుంచి పెరిగిన జీతాలను పూర్తి స్థాయిలో చెల్లించాలని, మినీ అంగన్వాడీ కేంద్రాల్లో హెల్పర్లను తక్షణం నియమించాలన్నారు. మే నెల జీతాలను అందని జిల్లాల్లో వెంటనే చెల్లించాలని, అంగన్వాడీలు ప్రచార సాధనాలు కాకుండా, వారికి గౌరవం కల్పించేలా చూడాలని ఆయన కోరారు. హరీష్ రావు లేఖలో కొన్ని ప్రధాన డిమాండ్లు ఉన్నాయి

Jyoti Malhotra: భారత్‌పై ద్వేషం.. పాక్‌పై మమకారం.. జ్యోతి మల్హోత్రా అలా మారిపోవడానికి కారణమేంటి?

Exit mobile version