Srinivas Goud : పీవీ మార్గ్ లోని నీరా కేఫ్‌ను మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సందర్శించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. అంతరించుకు పోతున్న కుల వృతులను కాపాడాలని నాటి ప్రభుత్వం నీరా కేఫ్ ను ప్రారంభించారని, మీ కుల వృత్తిని కాపాడమని మాజీ సీఎం కేసీఆర్ చెప్పారన్నారు. నీరా పాలసీ తీసుకొచ్చింది నాటి ప్రభుత్వం. ఆరోగ్య కరమైన నీరా పానీయం అందించే లక్ష్యం చేసిందన్నా శ్రీనివాస్ గౌడ్. నీరా ప్రొడక్ట్స్ కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయని, సంప్రదాయ ఫుడ్ అందించాలని చూశామన్నారు. ప్రైవేట్ కాంట్రాక్టర్‌కి ఇచ్చి చాట్ బండార్ తయారు చేసారన్నారు శ్రీనివాస్ గౌడ్. ఇక్కడ ఏసీలు తీసేసి, నీరా ఉత్పత్తులు తీసేసి దీని నిర్వహణ మొత్తం తీసేశారని, లక్షలాది మంది గౌడన్న లకు ఆత్మగౌరవం దెబ్బతినేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేస్తోందని ఆయన మండిపడ్డారు.
IND vs PAK: తొలి ఓవర్‌తో షమీ పేరిట చెత్త రికార్డు..
రాజకీయ కక్ష తో నీరా పాలసీ ఎత్తివేసారని, ఆరోగ్యమైన డ్రింక్ అని దీన్ని సేవిస్తారన్నారు. నీరా కేంద్రాన్ని ఎత్తేసి ప్రైవేట్ కేంద్రం లా తయారు చేసారని ఆయన వ్యాఖ్యానించారు. బీసీ ల సంఖ్య తగ్గించి లెక్కలు చేశారని, బీసీ కార్పొరేషన్ ద్వారా దీన్ని నిర్మించామని ఆయన పేర్కొన్నారు. భారత్ దేశం లో అన్ని రాష్ట్రాల వారు ఇక్కడికి వచ్చి సందర్శించారని, ఇది ప్రైవేట్ కు ఇచ్చే ఆలోచన చేస్తే తిరుగుబాటు తప్పదన్నారు శ్రీనివాస్‌గౌడ్. ఆ ఆలోచన మానుకోవాలని, రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిపిద్దాన్నారు. అన్ని కులాలు కలిసి రావాలని, అసెంబ్లీ ముట్టడి చేద్దామా? హైద్రాబాద్ దిగ్బంధం చేద్దామా? గౌడన్న లు ఆలోచన చేయండని ఆయన అన్నారు.
KTR: రేవంత్ రెడ్డికి బీజేపీ రక్షణ కవచంగా నిలుస్తున్నది