Kishan Reddy : ప్రపంచమంతా ఎరువుల ధరలు పెరిగితే ఒక్క భారతదేశంలోనే రేటు పెరగలేదని, కాంగ్రెస్ హయాంలో యూరియా బ్లాక్ మార్కెట్ లో అమ్ముకున్నారని ఆరోపించారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. ఇవాళ ఆయన మెదక్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని మోడీ హయాంలో తెలంగాణకి పసుపు బోర్డు వచ్చిందని, తెలంగాణలో ప్రధాని ఇచ్చిన పథకాలు అమలు కావాలంటే ఇక్కడ కూడా డబుల్ ఇంజన్ సర్కార్ రావాలన్నారు కిషన్ రెడ్డి. కేసీఆర్ కుటుంబం తెలంగాణని దోపిడీ చేస్తే…ఇప్పుడు సోనియాగాంధీ కుటుంబం దోపిడి చేస్తుందని, గతంలో కేసీఆర్ మెడలు ఎలా వంచామో…ఇప్పుడు రేవంత్ రెడ్డి మెడలు వంచుతామన్నారు. గత పదేళ్ళలో కేసీఆర్ కుటుంబం తెలంగాణ రాష్ట్రాన్ని దోపిడీ చేసిందని, 14 నెలల్లో తెలంగాణ రాష్ట్రాన్ని రాహుల్ గాంధీకి తాకట్టు పెట్టాడన్నారు కిషన్ రెడ్డి.
Ponguleti Sudhakar Reddy : మా శాయశక్తుల మీ సమస్య కోసం పోరాడుతాం
రాహుల్, రేవంత్ టాక్స్ ల పేరుతో బెదిరించి డబ్బు వసూళ్లు చేస్తున్నారని, ఆనాడు కేసీఆర్ కుటుంబం దోపిడీ చేస్తే ఇప్పుడు రాహుల్ గాంధీ దోపిడీ చేస్తున్నాడన్నారు. హైదరాబాద్ చుట్టు పక్కల ఉన్న ప్రభుత్వ భములను రేవంత్ రెడ్డి అమ్మేస్తారని, రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఉన్నన్ని రోజులు వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు కావని ఆయన వ్యాఖ్యానించారు. కేటీఆర్ మాట్లాడినట్టే ఎగిరెగిరి సీఎం రేవంత్ మాట్లాడుతున్నారని, మేము బియ్యం ఇస్తుంటే కేసీఆర్ కి ఇక్కడ రేషన్ కార్డు ఇవ్వడానికి మనసు రాలేదన్నారు. వైఎస్సార్ ఇచ్చిన రేషన్ కార్డులే ఇప్పటికి ఉన్నాయని, సీఎం రేవంత్ కూడా రేషన్ కార్డులు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారన్నారు కిషన్ రెడ్డి.
Maharashtra: మహాయుతిలో ముసలం.. ప్రభుత్వ కార్యక్రమాలకు షిండే దూరం!