Taarak Mehta Ka Ooltah Chashmah Actor Sodi Aka Gurucharan Singh Missing: హిందీలో ‘తారక్ మెహతా కా ఊల్తా చష్మా’ అనే టీవీ సీరియల్‌లో సోధి పాత్రలో నటించి ఫేమస్ అయిన గురు చరణ్ సింగ్ గత నాలుగు రోజులుగా కనిపించడం లేదు. ఈ విషయాన్ని అతని తండ్రి ఢిల్లీ పోలీసులకు తెలిపారు. గురు చరణ్ సింగ్ తండ్రి తెలిపిన వివరాల ప్రకారం.. గురు చరణ్ సింగ్ సోమవారం ఇంటి నుంచి ఢిల్లీ విమానాశ్రయానికి వెళ్లారు. అతను ముంబైకి బయలుదేరాడు కానీ అతను ముంబైకి చేరుకోలేదు లేదా ఇంటికి తిరిగి రాలేదని పేర్కొన్నారు. గురుచరణ్ సింగ్ తండ్రి పోలీస్ స్టేషన్‌కి వెళ్లి నటుడు తప్పిపోయినట్టు రిపోర్ట్ చేశారు. రిపోర్ట్ ప్రకారం ‘నా కొడుకు గురు చరణ్ సింగ్, వయస్సు: 50 సంవత్సరాలు, ఏప్రిల్ 22 ఉదయం 8:30 గంటలకు ముంబైకి బయలుదేరాడు.
Vakeel Saab: థియేటర్లలోకి వకీల్ సాబ్ మళ్ళీ వస్తున్నాడు
అతను విమానాశ్రయానికి వెళ్ళాడు, కాని ముంబైకి చేరుకోలేదు లేదా ఇంటికి తిరిగి రాలేదు. అతని ఫోన్ కూడా అందుబాటులో లేదు. అతను మానసికంగా స్థిరంగా ఉన్నాడు. మేము అతని కోసం వెతికాము, కానీ అతను కనిపించలేదు అని పేర్కొన్నారు. ఇక గురుచరణ్ సింగ్ చివరిసారిగా ‘తారక్ మెహతా కా ఉల్టా చష్మా’ అనే టీవీ షోలో రోషన్ సింగ్ సోధి పాత్రలో కనిపించాడు. తన తండ్రి ఆరోగ్య సమస్యల కారణంగా టీవీ షో నుంచి తప్పుకున్నాడు. తన సమయాన్ని కుటుంబంపైనే కేంద్రీకరించాలని కోరుకుంటున్నట్లు అప్పట్లో తెలిపాడు. అయితే, షో నుండి నిష్క్రమించిన ఇతర కళాకారుల మాదిరిగా, మేకర్స్ గురుచరణ్‌కు తమ బకాయిలు చెల్లించలేదు. ఇక ఢిల్లీలోని పాలం పోలీస్ స్టేషన్‌లో గురుచరణ్ సింగ్ మిస్సింగ్ రిపోర్టు నమోదైంది. ఈ ఫిర్యాదు ఏప్రిల్ 25న నమోదైంది.