అనతి కాలంలోనే తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ లలో తాప్సీ ఒకరు. 2010లో ‘ఝుమ్మందినాదం’ సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ఈ ఢిల్లీ బ్యూటీ, ఆరంభంలో గ్లామర్ పాత్రలు చేసినప్పటికీ, ఆ తర్వాత బాలీవుడ్ లో ‘పింక్’, ‘తప్పాడ్’, ‘బద్లా’ వంటి సినిమాలతో తనలోని నటిని ప్రపంచానికి చాటి చెప్పింది. ముక్కుసూటిగా మాట్లాడే నైజం, పాత్ర కోసం ఎంతటి సవాళ్లనైనా స్వీకరించే పట్టుదల ఆమెను పవర్‌ఫుల్ లేడీగా నిలబెట్టాయి. నటనలోనే కాకుండా నిర్మాతగానూ రాణిస్తోంది తాప్సీ. అయితే…