T20 World Cup 2026 Schedule: టీ20 క్రికెట్ వరల్డ్ కప్ 2026 షెడ్యూల్ విడుదల.. భారత్-పాక్ మ్యాచ్ ఎప్పుడంటే..?
- టీ20 వరల్డ్ కప్ 2026 షెడ్యూల్‌ను ICC అధికారికంగా విడుదల
- టోర్నమెంట్ ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8, 2026 వరకు
- వరల్డ్ కప్‌ను భారత్–శ్రీలంకలు సంయుక్తంగా నిర్వహణ.
- భారతదేశంలోని ప్రధాన వేదికలు: అహ్మదాబాద్, చెన్నై, ముంబై, న్యూఢిల్లీ, కోల్‌కతా.
- ఫిబ్రవరి 15న కొలంబోలో భారత్–పాకిస్తాన్ మ్యాచ్
- బ్రాండ్ అంబాసడర్‌గా రోహిత్ శర్మ.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
T20 World Cup 2026 Schedule: మెన్స్ టీ20 క్రికెట్ వరల్డ్ కప్ 2026 షెడ్యూల్‌ను ఐసీసీ (ICC) అధికారికంగా విడుదల చేసింది. ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్ ఫిబ్రవరి 7 నుండి మార్చి 8, 2026 వరకు జరగనుంది. నేడు ముంబైలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఐసీసీ ఈ కీలక వివరాలను ప్రకటిస్తూ, టోర్నమెంట్‌కి భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మను బ్రాండ్ అంబాసడర్‌గా నియమించింది. ఈసారి టీ20 వరల్డ్ కప్ మెగా ఈవెంట్ ను భారత్, శ్రీలంక సంయుక్తంగా నిర్వహించనున్నాయి. భారతదేశంలో అహ్మదాబాద్, చెన్నై, ముంబై, న్యూఢిల్లీ, కోల్‌కతా వేదికల్లో మ్యాచ్‌లు జరుగుతాయి. అలాగే శ్రీలంకలోని మూడు వేదికలు కూడా ఈ మెగా టోర్నీకు ఆతిథ్యమివ్వనున్నాయి. ఇక ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఎదురుచూస్తున్న భారత్, పాకిస్తాన్ పోరు ఫిబ్రవరి 15న కొలంబోలో జరగనుంది.
Local Body Elections : ఎన్నికల అలర్ట్..! కీలక తేదీలు ఇవే..!
Also Read
భారత్ సూపర్ 8 దశకు చేరితే.. ఆ మ్యాచ్‌లు అహ్మదాబాద్, చెన్నై, కోల్‌కతా వేదికల్లో నిర్వహించబడతాయి. అలాగే సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తే టీమిండియా తన కీలక మ్యాచ్‌ను ముంబై వేదికలో ఆడనుంది. ఈసారి నాలుగు గ్రూపులుగా జట్లను విభజించారు. గ్రూప్ Aలో భారత్, పాకిస్తాన్, USA, నెదర్లాండ్స్, నమీబియా ఉన్నాయి. ఇక గ్రూప్ Bలో ఆస్ట్రేలియా, శ్రీలంక, ఐర్లాండ్, జింబాబ్వే, ఒమాన్ ఉండగా.. గ్రూప్ Cలో ఇంగ్లాండ్, వెస్టిండీస్, బంగ్లాదేశ్, నేపాల్, ఇటలీలు.. ఇంకా గ్రూప్ Dలో న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, ఆఫ్ఘానిస్థాన్, కెనడా, UAE జట్లు ఉన్నాయి.
Visakhapatnam: విశాఖపట్టణం గూఢచర్య కేసులో ఇద్దరు నిందితులకు శిక్షలు.. NIA ప్రత్యేక కోర్టు తీర్పు
టీ20 వరల్డ్ కప్ 2026లో భారత్ తన తొలి మ్యాచ్‌ను ఫిబ్రవరి 7న ముంబై వేదికలో USAతో ఆడనుంది. ఫిబ్రవరి 12న న్యూఢిల్లీలో నమీబియాతో, ఫిబ్రవరి 15న కొలంబోలో పాకిస్తాన్‌తో హై వోల్టేజ్ మ్యాచ్‌లో తలపడనుంది. అనంతరం ఫిబ్రవరి 18న అహ్మదాబాద్‌లో నెదర్లాండ్స్‌తో తన చివరి గ్రూప్ మ్యాచ్‌ను ఆడుతుంది. భారత్–పాక్ హై వోల్టేజ్ మ్యాచ్, రోహిత్ శర్మ కొత్త పాత్ర, భారత్‌లో జరగనున్న కీలక మ్యాచ్‌లు.. ఇవన్నీ కలిపి ఈసారి టీ20 ప్రపంచకప్‌పై మరింత ఉత్కంఠను, ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!