బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ జూన్‌లో అమెరికా, వెస్టిండీస్ లో జరగనున్న 2024 T20 ప్రపంచ కప్ కోసం భారత జట్టు ఎంపికను సమర్థించారు. జట్టును ప్రకటించిన రెండు రోజుల తర్వాత గురువారం ముంబైలో సంయుక్తంగా విలేకరుల సమావేశం నిర్వహించారు. జట్టు ఎంపిక గురించిన ప్రశ్నలకు వారు సమాధానం ఇచ్చారు.
Also read: SRH vs RR: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్ రైజర్స్ హైదరాబాద్..
రింకూ సింగ్‌కు స్థానం రాకపోవడంపై అగార్కర్ స్పందిస్తూ.. అది దురదృష్టకరమని అన్నారు. జట్టులో అదనపు బౌలర్ ఉండాలని, అందుకే రింకూ సింగ్‌ను తప్పించాల్సి వచ్చిందని పేర్కొంది. రింకూ సింగ్ ఎలాంటి తప్పు చేయలేదని, శుభమాన్ గిల్ విషయంలో కూడా అదే నిజమని అగార్కర్ చెప్పాడు. స్పిన్నర్ల విషయానికొస్తే., కెప్టెన్ రోహిత్ శర్మకు మరిన్ని ఎంపికలు ఇవ్వడానికి ఇద్దరు మణికట్టు స్పిన్నర్లను ఎంపిక చేశామని., అందుకే అక్షర్ పటేల్‌ను జట్టులోకి తీసుకురావడం వెనుక కూడా అదే అంటూ తెలిపాడు. అందుకే తాము రింకూ సింగ్ విషయంలో కఠినంగా వ్యవహరించాల్సి వచ్చిందని తెలిపారు.
Also read: Elephant Attack: సఫారీ జీప్‌పై దాడి చేసిన ఏనుగు.. చివరకు.. వీడియో వైరల్..
కె.ఎల్. రాహుల్ టాప్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేస్తాడని, మధ్యలో బ్యాటింగ్ చేయగల ఆటగాళ్లను ఎంచుకున్నామని చెప్పాడు. రోహిత్ శర్మ ఏడాది పాటు టీ20 క్రికెట్ ఆడటం దూరంగా ఉన్నాడు కదా అని మీడియా అడిగిన ప్రశ్నకు అగార్కర్ సమాధానమిస్తూ.. ఆ సమయంలో టెస్టు క్రికెట్‌పై దృష్టి సారించాడని చెప్పాడు. హార్దిక్ పాండ్యా ఆడగల ఆటగాడని, జట్టు బ్యాలెన్స్ పరంగా కెప్టెన్ రోహిత్ శర్మకు ఇది చాలా సానుకూలంగా ఉంటుందని అగార్కర్ అన్నాడు. గాయం తర్వాత చాలా కాలం తర్వాత తాను టీమ్‌లో చేరానడని, తాను రాణిస్తాడని ఆశిస్తునట్లు అజిత్ అగార్కర్ చెప్పాడు. విరాట్ కోహ్లి ఆటతీరుకు సంబంధించి ప్రస్తుతం అలాంటి చర్చలేమీ లేవని అన్నాడు. ప్రస్తుత ఐపీఎల్‌లో కోహ్లీ అద్భుత బ్యాటింగ్ తో ప్రశంసలు అందుకుంటున్నాడు.