David Wiese Creates History: టీ20 క్రికెట్‌లో నమీబియా ప్లేయర్ డేవిడ్ వీస్ అరుదైన ఘనత సాధించాడు. టీ20 కెరీర్‌లో 400 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న తొలి నమీబియా ఆటగాడిగా రికార్డుల్లో నిలిచాడు. పొట్టి ఫార్మాట్‌లో ఈ ఘనత సాధించిన 29 ఆటగాడు కూడా. 2008 నుంచి క్రికెట్ ఆడుతున్న డేవిడ్ వీస్.. 4472 రన్స్ చేశాడు. అతడి అత్యధిక వ్యక్తిగత స్కోర్ 79 నాటౌట్. అలానే 327 వికెట్స్ కూడా పడగొట్టాడు. టీ20 క్రికెట్‌లో బెస్ట్ బౌలింగ్ గణాంకాలు 5/19. పొట్టి క్రికెట్‌లో డేవిడ్ వీస్ 20 జట్లకు పైగా ప్రాతినిథ్యం వచించాడు.
Also Read: ENG vs IND: భారత్ ఓటములకు ప్రధాన కారణం అదే: టీమిండియా కోచ్
టీ20 ఫార్మాట్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఆటగాడిగా విండీస్ దిగ్గజం కీరన్ పోలార్డ్ ఉన్నాడు. పొట్టి ఫార్మాట్‌లో 707 మ్యాచ్‌లు ఆడాడు. ఈ జాబితాలో డ్వేన్ బ్రావో (582), ఆండ్రీ రసెల్ (561), షోయబ్ మాలిక్ (557), సునీల్ నరైన్ (554), డేవిడ్ మిల్లర్ (530), అలెక్స్ హేల్స్ (503), రవి బొపారా (491), గ్లెన్ మ్యాక్స్‌వెల్ (478), రషీద్ ఖాన్ (477) ఉన్నారు. భారత్ తరఫున అత్యధిక టీ20లు ఆడిన ప్లేయర్ రోహిత్ శర్మ (463). అత్యధిక అంతర్జాతీయ టీ20లు ఆడింది కూడా హిట్‌మ్యాన్ కావడం విశేషం.