T Subbirami Reddy Tribute to Krishnam Raju
రెబల్ స్టార్ కృష్ణంరాజు మృతితో చిత్ర పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది. సినీ రాజకీయ ప్రముఖులు కృష్ణంరాజుకు కడసారి వీడ్కోలు ఇవ్వడానికి ఆయన ఇంటికి బయల్దేరారు. ఇక సోషల్ మీడియా వేదికపై పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన మృతిపట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే కృష్ణంరాజు ఇంటి వద్దకు చేరుకున్న టి సుబ్బిరామిరెడ్డి ఆయన నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బీజేపీ సీనియర్ నాయకులు, కేంద్ర మాజీ మంత్రి అయిన కృష్ణం రాజు మా మధ్య లేక పోవడం చాలా బాధాకరమన్నారు. తాను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అయిన తరవాత అనేక సలహాలు ఇచ్చేవారని, అర్థరాత్రి ఫోన్ చేసిన స్పందించే వారని ఆయన వెల్లడించారు. ఒక నిజాయితీ గల వ్యక్తిగా ఆయనకు పేరు ఉండేదని, రెబల్ స్టార్‌గా అనేక మంది అభిమానులుగా మారారని ఆయన అన్నారు. అంతిమ తీర్పు సినిమా చూసి ఆయనతో ఒక్క ఫోటో తీసుకుంటే చాలు అనుకున్నానని ఆయన వెల్లడించారు.
ప్రభాస్ అంటే ఆయనకు చాలా ఇష్టమని, మా బంధం 50 ఏళ్ళ నాటిది. కృష్ణంరాజు లేడు అంటే నమ్మలేకపోతున్నా. మంచి నటుడు, మంచి స్నేహితుడు. ఎంతో ఆప్యాయంగా ఉండేవాడు. కృష్ణం రాజు లేరు అంటే నమ్మలేక పోతున్నాం. నాకు చాలా మంచి మిత్రుడు, మంచి నటుడు. సినీ పరిశ్రమకు తీరని లోటు. ప్రభాస్ అంటే ఆయనకు చాలా ప్రేమ. నా ప్రియ మిత్రుడు, గ్రేట్ పర్సనాలిటీ… ఎన్నో అవార్డ్స్ పొందిన వ్యక్తి. అభిమానులకు ప్రగాఢ సానుభూతి అని ఆయన వ్యాఖ్యానించారు.