Sambarala Yeti Gattu: ‘సంబరాల ఏటిగట్టు’లో సీనియర్ హీరో క్రేజీ రోల్! చూస్తే షాక్ కావాల్సిందే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sambarala Yeti Gattu: సుప్రీం హీరో సాయి దుర్గా తేజ్ హీరోగా, రోహిత్ కె.పి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం “SYG” (సంబరాల ఏటిగట్టు). ‘హనుమాన్’ వంటి గ్లోబల్ బ్లాక్ బస్టర్ అందించిన ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై కె.నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి ఒక ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ బయటకు వచ్చింది. ఈ చిత్రంలో సీనియర్ హీరో శ్రీకాంత్ ఒక కీలకమైన, పవర్‌ఫుల్ రోల్ చేస్తున్నారు. ఈరోజు శ్రీకాంత్ పుట్టినరోజు సందర్భంగా చిత్ర యూనిట్ ఆయన పాత్రకు సంబంధించిన ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ సినిమాలో ఆయన ‘బ్రిటిషు’ అనే పాత్రలో కనిపించబోతున్నారు. తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్‌లో ఆయన లుక్ అదిరిపోయింది.
READ ALSO: Delhi: ఆ వార్తలన్నీ అబద్ధం.. హార్ముజ్ దగ్గర వసూళ్లపై ఇరాన్ ఎంబసీ కీలక ప్రకటన
Also Read
- CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
- AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
- Story Board: ధరల మంట: రికార్డు స్థాయిలో ద్రవ్యోల్బణం.. పెరిగిన ధరలతో బతికేదెలా..?
- OTR: మన్యం జిల్లా జడ్పీ చైర్మన్ పదవికి ఎస్టీ రిజర్వేషన్.. టీడీపీ నేతల్లో అసంతృప్తి
ఒంటిపై ఉన్న ప్రతి గాయాన్ని ఒక పతకంలా ధరించే మొండి ధైర్యం గల సైనికుడిగా శ్రీకాంత్ లుక్ చాలా రఫ్ అండ్ టఫ్ గా ఉంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ‘అసుర ఆగమన’ గ్లింప్స్ సంచలనం సృష్టించగా, ఇప్పుడు శ్రీకాంత్ పోస్టర్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. ఈ సినిమా కోసం టాప్ క్లాస్ టెక్నికల్ టీమ్ వర్క్ చేస్తుంది. ఈ చిత్రానికి బి.అజనీష్ లోకనాథ్ (కాంతార ఫేమ్) సంగీతం అందిస్తుండగా, వెట్రివేల్ పళనిసామి సినిమాటోగ్రఫీ, నవీన్ విజయకృష్ణ ఎడిటింగ్ చేస్తున్నారు. ఈ చిత్రంలో సాయి దుర్గా తేజ్ సరసన ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్‌గా నటిస్తుండగా.. జగపతి బాబు, సాయి కుమార్, అనన్య నాగళ్ల వంటి నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానున్న ఈ చిత్రం, ఈ ఏడాది టాలీవుడ్‌లో వస్తున్న బిగ్గెస్ట్ సినిమాటిక్ ఈవెంట్‌గా నిలవనుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
తాజావార్తలు
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్కి గుడ్ న్యూస్… హైదరాబాద్లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..