Kangana Ranaut: ప్రధాని మోడీని కలిసిన బాలీవుడ్ క్వీన్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kangana Ranaut: బాలీవుడ్ ఫైర్ బ్రాండ్, హిమాచల్ ప్రదేశ్‌లోని మండి నియోజకవర్గ బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ ఈరోజు తన 40వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని ఆమెకు సోషల్ మీడియా వేదికగా అభిమానులు, సినీ రాజకీయ ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అయితే, ఈ ఏడాది తన పుట్టినరోజును ఆమె అత్యంత ప్రత్యేకంగా, ప్రధాని నరేంద్ర మోడీ సమక్షంలో జరుపుకున్నారు.
READ ALSO: War Break: ట్రంప్ సంచలన నిర్ణయం.. ఇరాన్ పై దాడులకు బ్రేక్..
Also Read
- AP Alliance Seat Sharing: టీడీపీ, జనసేన, బీజేపీ పోటీ చేసే స్థానాలపై క్లారిటీ.. అధికారిక ప్రకటన ఎప్పుడంటే?
- Instant Noodle: ఇన్స్టంట్ నూడుల్స్ తినడంలో భారత్ రికార్డు..! చైనా, జపాన్, వియత్నాం స్థానాలివే..
- Bhindi Health Benefits: బెండకాయ జిగురును చూసి దూరం పెడుతున్నారా? ప్రయోజనాలు తెలిస్తే షాకే..!
- Telangana Bar Licences Draw : లక్కీ డ్రాలో లక్ ఎవరికో?.. రాష్ట్రంలో బార్ల కేటాయింపునకు సర్వం సిద్ధం..
ప్రధానితో చిరస్మరణీయ భేటీ..
తన పుట్టినరోజు సందర్భంగా కంగనా కుటుంబ సభ్యులతో కలిసి ప్రధాని మోడీని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ భేటీకి సంబంధించిన ఫోటోలను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. ఈ సందర్భంగా కంగనా హిమాచల్ సంస్కృతి ప్రతిబింబించేలా ప్రధానికి ఒక శాలువాను స్వయంగా కప్పారు. ఆమె సోదరుడు అక్షత్ రనౌత్.. ‘దశావతారాన్ని’ అద్భుతంగా చిత్రీకరించిన ఇత్తడి వాల్ ఫ్రేమ్‌ను ప్రధానికి బహుమతిగా అందజేశారు. ప్రధాని మోడీ కంగనా కుటుంబంతో సరదాగా గడిపారు. ముఖ్యంగా కంగనా మేనల్లుడితో ప్రధాని ఆడుకుంటున్న ఫోటోలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. “ఈరోజు నా కుటుంబంతో పాటు గౌరవనీయ ప్రధానమంత్రి గారి సమయాన్ని, మార్గదర్శకత్వాన్ని పొందడం నా అదృష్టం. ఇది నాకు మర్చిపోలేని పుట్టినరోజు” అంటూ కంగనా తన పోస్ట్‌లో పేర్కొన్నారు.
రాజకీయాల్లో బిజీ.. సినిమాల్లోకి రీ-ఎంట్రీ ఎప్పుడంటే..
2024 లోక్‌సభ ఎన్నికల్లో గెలిచి ఎంపీగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కంగనా రాజకీయాల్లో ఎంతో చురుకుగా ఉంటున్నారు. ఆమె దర్శకత్వం వహించి నటించిన ‘ఎమర్జెన్సీ’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించకపోయినా, ఇందిరా గాంధీ పాత్రలో ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ప్రస్తుతం అభిమానులు ఆమెను మళ్లీ వెండితెరపై ఎప్పుడు చూస్తామా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కంగనా చేతిలో ఇప్పుడు పలు క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. గతంలో ‘తను వెడ్స్ మను’ వంటి హిట్స్ ఇచ్చిన ఆర్.మాధవన్‌తో కలిసి ఆమె రెండు సినిమాల్లో నటించనున్నారు. అందులో ఒక చిత్రం షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. ఆనంద్ ఎల్.రాయ్ దర్శకత్వంలో రాబోయే తను వెడ్స్ మను 3 హిట్ ఫ్రాంచైజీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
READ ALSO: Dhurandhar 2: బాక్సాఫీస్ వద్ద ‘ధురంధర్’ వసూళ్ల సునామీ.. ‘ఆర్‌ఆర్ఆర్’ రికార్డులు బ్రేక్
తాజావార్తలు
-
CM Revanth Reddy : ఎండల సెగ.. నీటి కష్టాలు.? రైతులకు సీఎం అలర్ట్
-
Consumer Court: రూ.2 కోసం కక్కుర్తి పడితే రూ.1.06 లక్షల వాత!
-
CM Revanth Reddy : ఎల్ నినో ముప్పుపై అప్రమత్తంగా ఉండాలి.. సీఎం రేవంత్ రెడ్డి పిలుపు
-
AP Alliance Seat Sharing: టీడీపీ, జనసేన, బీజేపీ పోటీ చేసే స్థానాలపై క్లారిటీ.. అధికారిక ప్రకటన ఎప్పుడంటే?
-
Kawasaki Z300 India Launch: Kawasaki Z300 భారత్‌లోకి.. ధర ఎంత? 296cc ఇంజిన్, ఫీచర్లు, లాంచ్ డేట్ వివరాలు!
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!