ప్రస్తుత బిజీ ప్రపంచంలో ఆన్ లైన్ కి అలవాటు పడ్డాం. ఇంట్లో వంట నచ్చకపోయినా.. కొత్తగా ఏమైనా తినాలన్నా వెంటనే స్విగ్గీలో ఆడర్ పెడతాం. బెంగళూరుకు చెందిన ఈ స్విగ్గీ మరో అడుగు ముందుకేసింది. త్వరలో స్విగ్గీ ఐపీఓ రానుంది. బెంగళూరుకు చెందిన స్విగ్గీ ప్రారంభ పబ్లిక్ ఆఫరింగ్ (Swiggy IPO) కు వాటాదారులు ఆమోదం తెలిపారు. దీంతో ఫుడ్ అండ్ గ్రోసరీ డెలివరీ వ్యాపారం నిర్వహించే స్విగ్గీ.. రూ.3,750 కోట్ల మూలధనంతో పాటు, ఆఫర్ ఫర్ సేల్ కాంపోనెంట్ ద్వారా రూ.6,664 కోట్ల (800 మిలియన్ డాలర్లు)ను సమీకరించాలని భావిస్తోంది.
READ MORE: AP Elections 2024: ముగిసిన నామినేషన్ల స్క్రూట్నీ.. ఫైనల్‌గా బరిలో నిలిచింది ఎవరంటే..?
ఇక స్విగ్గీ కాస్త.. ఐపీఓకు ముందు స్విగ్గీ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా మారనుంది. స్విగ్గీ 1 బిలియన్ డాలర్లను సమీకరించే యోచనలో ఉన్నట్లు సమాచారం. దాని కోసం యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి సుమారు రూ.750 కోట్లు డిమాండ్ చేస్తున్నట్లు తెలిసింది. కాగా, స్విగ్గీ ఇంకా సెబీ (sebi) కి తన ఐపీఓ (Swiggy IPO) ఫైలింగ్స్ ను సమర్పించలేదు. ఏప్రిల్ 23న జరిగిన స్విగ్గీ అసాధారణ సర్వసభ్య సమావేశం (EGM)లో ఐపీఓకు అంగీకరిస్తూ ప్రత్యేక తీర్మానాన్ని షేర్ హోల్డర్లు ఆమోదించారు. స్విగ్గీ (Swiggy) లో టాప్ ఇన్వెస్టర్ గా నెదర్లాండ్స్ కు చెందిన ప్రోసస్ (Prosus) కంపెనీ ఉంది. స్విగ్గీలో దీనికి 35% వాటా ఉంది. తరువాత స్థానంలో సాఫ్ట్ బ్యాంక్ ఉంది. టెన్సెంట్, యాక్సెల్, ఎలివేషన్ క్యాపిటల్, మీటువాన్, నార్వెస్ట్ వెంచర్ పార్ట్నర్స్, డీఎస్టీ గ్లోబల్, ఖతార్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ, కోట్యూ, ఆల్ఫా వేవ్ గ్లోబల్, ఇన్వెస్కో, హిల్హౌస్ క్యాపిటల్ గ్రూప్, జీఐసీ.. మొదలైనవి ఇతర వాటాదారులుగా ఉన్నాయి. కంపెనీ సహ వ్యవస్థాపకులు శ్రీహర్ష మజేటి, నందన్ రెడ్డి, రాహుల్ జైమినిలకు వరుసగా 4.2 శాతం, 1.6 శాతం, 1.2 శాతం వాటాలు ఉన్నట్లు డేటా ప్లాట్ ఫామ్ ట్రాక్సన్ తెలిపింది. 2020 లో, జైమిని తన కార్యకలాపాల స్థానాన్ని విడిచిపెట్టి పెస్టో టెక్ అనే కొత్త స్టార్టప్ ను ప్రారంభించారు.