Prithvi Shaw: ఇండియన్ క్రికెట్‌లో జనరేషన్ లో స్టార్ గా ఎదిగే ఆటగాడిగా ప్రశంసలు అందుకున్న పృథ్వీ షా గత రెండేళ్లుగా అందరి విమర్శలకు కేంద్రబిందువుగా మారాడు. ముంబయి రంజీ జట్టులో చోటు కోల్పోవడం, 2025 ఐపీఎల్ వేలంలో ఎవ్వరూ కొనుగోలు చేయకపోవడం… ఇలా షా కెరియర్ ఒక్కసారిగా దిగజారింది. తాజాగా ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పృథ్వీ తన జీవితంలోని నిజాలను, కెరియర్ నాశనం కావడానికి గల కారణాలను పంచుకున్నాడు.
ఈ సందర్బంగా పృథ్వీ షా మాట్లాడుతూ.. జీవితంలో కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకున్నానని.. 2023 వరకు రోజూ పది గంటలుగా క్రికెట్ గ్రౌండ్‌లో ఉండే వాడిని. కానీ, ఆ తర్వాత దానికన్నా తక్కువ ప్రాధాన్యం ఇవ్వడం మొదలుపెట్టానని షా ఆవేదన వ్యక్తం చేశాడు. నాకు గత కొంత కాలంగా ఎన్దో కొత్త స్నేహితులు వచ్చారు. కానీ వారు ఎవ్వరు నిజమైన స్నేహితులు కాదు.. నేనేం చేస్తున్నానో, ఎటు వెళ్తున్నానో తెలిసేలోపే నా ఫోకస్ మారిపోయింది. 8 గంటలు క్రికెట్‌కు ఇచ్చే సమయం 4 గంటలకు పరిమితమయ్యిందని అన్నారు.
Read Also:Fairphone Gen 6: 5 ఏళ్ల వారంటీ, మరమ్మతులకు అనుకూలంగా ఉండేలా మొబైల్ లాంచ్..!
అలాగే పృథ్వీ షా తన తాతగారి మరణం గురించి మాట్లాడుతూ చాలా భావోద్వేగంతో స్పందించాడు. ఇది చిన్న విషయం కాదు.. నా కుటుంబంలో పెద్ద సమస్య. నా తాత గారు నాకు బాగా ఇష్టమైనవారు. ఆయన మరణం నన్నెంతో లోపల నుండి కలచి వేసింది. ఇంకా చెప్పలేని విషయాలు చాలా ఉన్నాయి. కానీ, వాటిని నేను అనుభూతిగా తప్ప వివరణగా చెప్పలేనని ఆయన మాట్లాడారు. ఇకపోతే, ప్రతికూల సమయంలో తన తండ్రి మాత్రమే అండగా నిలిచాడని పృథ్వీ చెప్పాడు. నాకున్న ఏకైక ఆశ్రయం నా నాన్నగారే. నేను ఎంత దారుణ స్థితిలో ఉన్నా, ఆయన ఎప్పుడూ నన్ను వదలలేదు. నాకు ఉన్న అతి పెద్ద బలం ఆయనే అంటూ ఎమోషనల్ అయ్యాడు. తనపై తలెత్తిన ఒత్తిళ్లు, విమర్శల నేపథ్యంలో పృథ్వీ షా ఇప్పుడు ముంబయి జట్టును వీడి కొత్త జట్టుకు ప్రాతినిధ్యం వహించేందుకు సిద్ధమయ్యాడు. ముంబయి క్రికెట్ సంఘం (MCA) నుండి No Objection Certificate (NOC) కూడా పొందాడు.