Sanju Samson: ప్రపంచకప్ గెలవాలనే ఆ ఒక్క నిర్ణయం శామ్సన్ కెరీర్‌ను మార్చేసిందా..? అసలు ఏం జరిగిందంటే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ వ్యాఖ్యాత ఆకాష్ చోప్రా యూట్యూబ్ ఛానెల్లో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో భారత క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ ప్రపంచకప్‌లో చోటుచేసుకున్న పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ముఖ్యంగా సంజూ శామ్సన్ను తుది జట్టు నుంచి తప్పించడం తన కెరీర్లో అత్యంత కఠినమైన నిర్ణయమని ఆయన పేర్కొన్నారు. ప్రపంచకప్‌కు ముందు న్యూజిలాండ్ సిరీస్‌లో శామ్సన్ ఆశించిన స్థాయిలో రాణించకపోగా, ఇషాన్ కిషన్ అద్భుతమైన ఫామ్‌లో ఉండటంతో శామ్సన్ను పక్కన పెట్టక తప్పలేదు. అయితే ఈ విషయాన్ని శామ్సన్‌కు చెప్పినప్పుడు, ఆయన ఇచ్చిన ప్రతిస్పందన తనకు ఎంతో ఆశ్చర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చిందని సూర్య తెలిపారు.
ప్రయాణ సమయంలో శామ్సన్తో మాట్లాడిన సూర్య, ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా మిమ్మల్ని జట్టులో కొనసాగించడం కష్టమని స్పష్టం చేశారు. దానికి శామ్సన్ సానుకూలంగా స్పందిస్తూ, “ఈ జట్టు ప్రపంచకప్ గెలవడానికి ఏది మంచిదనిపిస్తే అదే చేయండి, ఎప్పుడు నా అవసరం వచ్చినా నేను సిద్ధంగా ఉంటాను” అని సూర్యతో చెప్పారు. తాను ప్రతి మ్యాచ్‌కూ తుది జట్టులో ఆడుతున్నట్లే సన్నద్ధమవుతానని శామ్సన్ హామీ ఇచ్చారు. ఈ మాటే తనకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చిందని సూర్య గుర్తు చేసుకున్నారు. గతంలో శ్రీలంక పర్యటనలో శామ్సన్ విఫలమైనప్పటికీ, అతడిపై తమకు ఉన్న నమ్మకంతో వరుసగా అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చిన విషయాన్ని కూడా సూర్య ఈ సందర్భంగా ప్రస్తావించారు.
Also Read
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- OTR: నారాయణ్ ఖేడ్‌లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
- OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
- US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
ప్రపంచకప్‌లో భారత్ ఆరంభంలో కాస్త నెమ్మదించినా, అభిషేక్ శర్మకు గాయం కావడం ఇతర సమీకరణాల వల్ల శామ్సన్‌కు తిరిగి అవకాశం లభించింది. ఈ లభించిన అవకాశాన్ని సంజూ శామ్సన్ పూర్తిస్థాయిలో వినియోగించుకున్నారు. కీలక మ్యాచ్‌ల్లో అద్భుతమైన బ్యాటింగ్‌తో చెలరేగి, భారత్ ప్రపంచకప్ విజేతగా నిలవడంలో ముఖ్య పాత్ర పోషించారు. ప్రపంచకప్ 2026 టోర్నీలో మొత్తం ఐదు ఇన్నింగ్స్‌లలో 80.25 సగటు, 321 పరుగులు సాధించి శామ్సన్ బిగ్గెస్ట్ ప్లేయర్ గా నిలిచారు.
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!