Suryakumar Yadav: భారత టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ప్రస్తుతం తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నారు. టీ20 ఫార్మాట్‌లో అతడి బ్యాటింగ్ ఫామ్ క్షీణించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గత 20 ఇన్నింగ్స్‌లుగా సూర్యకుమార్ ఒక్క టీ20 మ్యాచ్ లో కూడా అర్ధశతకం చేయలేకపోయారు. గత ఏడాది నవంబర్ నుంచి ఇప్పటి వరకు ఆయన కేవలం 227 పరుగులే చేయగా, 13.35 సగటుగా ఉంది. ఇదే ప్రదర్శన భారత్- దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లోనూ కొనసాగుతోంది. తొలి మ్యాచ్‌లో 12 రన్స్ మాత్రమే చేసిన సూర్య, రెండో మ్యాచ్‌లో 5 పరుగులకే పెవిలియన్‌కు చేరారు.
Read Also: Khauf: OTTలో ఈ హర్రర్ సిరీస్‌ను చూశారా? వెన్నులో వణుకు పుట్టాల్సిందే..
ఈ నేపథ్యంలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పాత్రపై తన యూట్యూబ్ ఛానల్‌లో మాజీ భారత క్రికెటర్ ఆకాష్ చోప్రా మాట్లాడుతూ.. మీరు జట్టు కెప్టెన్ అయినా సరే, కెప్టెన్ పని కేవలం టాస్ వేయడం, బౌలర్లను నిర్వహించడం లేదా వ్యూహాలు రచించడం మాత్రమే కాదు.. టాప్- 4లో బ్యాటింగ్ చేసే ఆటగాడిగా మీ ప్రధాన బాధ్యత పరుగులు చేయడమే అన్నారు. చాలా మంది మ్యాచ్‌లుగా సగటు 14 చుట్టూ ఉండటం, స్ట్రైక్‌రేట్ కూడా ఆశించిన స్థాయిలో లేకపోవడం, ఒక్క హాఫ్ సెంచర్ కూడా లేకపోవడం ఆందోళనకరమని పేర్కొన్నారు. అయితే, సూర్యకుమార్ కెప్టెన్సీపై తనకు ఎలాంటి సందేహాలు లేవని ఆకాష్ చోప్రా స్పష్టం చేశారు.
Read Also: Woman Dies of Heart Attack: తమ్ముని ఓటమిని చూడలేని.. గుండెపోటుతో మృతి
ఇక, వరల్డ్‌కప్‌లో సూర్యకుమార్ యాదవ్ భారత జట్టుకు నాయకత్వం వహించకూడదని నేను చెప్పడం లేదని మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా తెలిపారు. కానీ నిజం ఏంటంటే.. అతడు తప్పనిసరిగా పరుగులు చేయాలి.. 2026 ఫిబ్రవరి- మార్చిలో భారత్, శ్రీలంక వేదికలుగా జరగనున్న టీ20 ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకుని, టాప్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేసే ఆటగాళ్లు నిలకడగా పరుగులు చేయడం అత్యంత కీలకం అన్నారు. బ్యాటింగ్ ఆర్డర్ లో నెంబర్ 3 లేదా 4లో బ్యాటింగ్ చేస్తూ రన్స్ రాకపోతే, వరల్డ్‌కప్ ట్రోర్నీలో ఆత్మవిశ్వాసం తగ్గిపోతుంది.. అందుకే సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్‌గా, శుభ్‌మన్ గిల్ వైస్ కెప్టెన్‌గా పరుగులు చేయడం జట్టుకు అత్యంత అవసరం అని ఆకాశ్ చోప్రా వెల్లడించారు.
