Surya Kumar Yadav: టీమ్‌లోకి మళ్లీ సూర్యకుమార్ యాదవ్..? బ్యాటింగ్‌లో మరోసారి విధ్వంసం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత క్రికెట్ జట్టు నుంచి దూరమై, కెప్టెన్సీ కోల్పోయిన స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ఇప్పుడు తన బ్యాట్‌తో సమాధానం చెబుతున్నాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ముంబై తరఫున ఆడుతున్న సూర్య, ఎదురైన ప్రతి జట్టుపై విరుచుకుపడుతున్నాడు. హైదరాబాద్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 21 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సర్లతో 60 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచిన సూర్య, తాజాగా గుజరాత్‌పై అంతకుమించిన విధ్వంసం సృష్టించాడు.
గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన సూర్యకుమార్ యాదవ్, కేవలం 29 బంతుల్లోనే 82 పరుగులు సాధించాడు. 283 స్ట్రైక్ రేట్‌తో సాగిన ఈ మెరుపు ఇన్నింగ్స్‌లో 9 ఫోర్లు, 7 భారీ సిక్సర్లు ఉన్నాయి. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ జట్టు 197 పరుగులకు ఆలౌట్ అయింది. ముంబై బౌలర్లు శార్దూల్ ఠాకూర్, అథర్వ అంకోలేకర్ తలో 3 వికెట్లు తీసి రాణించారు.
Also Read
- Smart Phone Prices Hike: సెల్‌ఫోన్ లవర్స్‌కు బ్యాడ్‌న్యూస్.. ఈ రెండు కంపెనీల ఫోన్ల ధరలు భారీగా పెంపు..
- Sonia Gandhi Memoir: సోనియా గాంధీ ఆత్మకథలో తప్పులు.. దాచిన విషయాలే వివాదాలు!
- No Flying Zone: విజయవాడలో అమిత్ షా పర్యటన.. కీలక ప్రాంతాల్లో 'నో ఫ్లైయింగ్ జోన్' అమలు..
- Rajat Patidar: 48 బంతుల్లో 135 పరుగులు.. ఆర్సీబీ కెప్టెన్ వీరవిహారం..
అనంతరం 198 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై జట్టు, సూర్య తుఫాన్ బ్యాటింగ్ తోడవడంతో కేవలం 15.4 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి 201 పరుగులు చేసి ఘనవిజయం సాధించింది. సర్ఫరాజ్ ఖాన్ కూడా 17 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 40 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో ముంబై వరుసగా రెండో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.
2026 మార్చి 8న జరిగిన టీ20 ప్రపంచకప్ ఫైనల్ తర్వాత సూర్యకుమార్ యాదవ్ మళ్లీ భారత జట్టు తరఫున ఆడలేదు. ఆ టోర్నీలో భారత్‌ను వరుసగా రెండోసారి విశ్వవిజేతగా నిలిపినప్పటికీ, ఆ తర్వాత జరిగిన పరిణామాలతో అతను కెప్టెన్సీతో పాటు జట్టులో చోటు కూడా కోల్పోయాడు. ప్రస్తుతం దేశవాళీ టీ20 టోర్నీలో అద్భుతమైన ఫామ్ కొనసాగిస్తూ, మళ్లీ టీమిండియాలోకి అడుగుపెట్టేందుకు సూర్య గట్టి పోరాటం చేస్తున్నాడు. ఈ ఫాంతో అతడిని టీంలోకి తీసుకునే అవకాశాలు ఉన్నట్లు క్రీడా వర్గలు పేర్కొంటున్నాయి.
- Tags
- cricket
- mumbai
- Suryakumar Yadav
- T20
తాజావార్తలు
-
Surya Kumar Yadav: టీమ్‌లోకి మళ్లీ సూర్యకుమార్ యాదవ్..? బ్యాటింగ్‌లో మరోసారి విధ్వంసం..
-
Bollywood : ఒకవైపు రణ్వీర్ సింగ్, మరోవైపు రణ్‌బీర్ కపూర్.. స్టార్ పవరా? సీక్వెల్స్ క్రేజా?
-
Smart Phone Prices Hike: సెల్‌ఫోన్ లవర్స్‌కు బ్యాడ్‌న్యూస్.. ఈ రెండు కంపెనీల ఫోన్ల ధరలు భారీగా పెంపు..
-
Sai Pallavi : జుట్టు కట్ చేస్తున్నానని తెలిసి మా అమ్మ ఫోన్ కట్ చేసింది.. పెద్ద దుమారమే రేపింది
-
Sonia Gandhi Memoir: సోనియా గాంధీ ఆత్మకథలో తప్పులు.. దాచిన విషయాలే వివాదాలు!
ట్రెండింగ్
-
Gully Cricket: సచిన్ టెండూల్కర్‌తో గల్లీ క్రికెట్ ఆడిన ప్రిన్స్ విలియం, కేట్..!
-
Mohit Ulva: ఒంటిచేత్తో మ్యాచ్‌ను మలుపు తిప్పాడు.. ఎవరీ మోహిత్ ఉల్వా.. జడేజా కోచ్ దగ్గరే శిక్షణ!
-
ICC Chairman-Jay Shah: రెండోసారి ఐసీసీ చైర్మన్‌గా జై షా.. ఈసారి కూడా ఏకగ్రీవమే!
-
Vaibhav Sooryavanshi: సచిన్ టెండూల్కర్ అవుతాడో లేక వినోద్ కాంబ్లీ అవుతాడో చెప్పడం కష్టం..!
-
India Schedule: రోహిత్, కోహ్లీ మళ్లీ ఆడేది అప్పుడే.. టీమిండియా నెక్స్ట్ షెడ్యూల్ ఇదిగో..!