తమిళ స్టార్ హీరో సూర్య గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. తెలుగులో కూడా ఆయన నటించిన సినిమాలు భారీ హిట్ ను అందుకోవడం తో ఆయనకు ఇక్కడ మార్కెట్ లో కూడా మంచి డిమాండ్ ఉంది.. ప్రస్తుతం ఈయన హీరోగా నటిస్తున్న ‘కంగువా’ మూవీ నుంచి ఒక క్రేజీ అప్డేట్ బయటికి వచ్చింది. ఈ సినిమాని కేవలం పాన్ ఇండియా స్థాయిలో కాకుండా పాన్ వరల్డ్ రేంజ్ లో రిలీజ్ చేస్తున్నారని సమాచారం.. ఇందులో మరో విశేషం అత్యధిక భాషల్లో విడుదల కాబోతున్న మొదటి పాన్ వరల్డ్ మూవీ ఇదే .
తమిళ మాస్ డైరెక్టర్ శివ దర్శకత్వంలో సూర్య హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘కంగువ’. సూర్య కెరియర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది.. ఇదిలా ఉండగా.. తాజాగా ఈ సినిమా షూటింగ్ కు బ్రేక్ పడింది.. చెన్నైలో ఈ సినిమా చివరి షెడ్యూల్ షూటింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే.. అయితే ఈ షూటింగ్ లో హీరో సూర్య భుజానికి గాయం తగిలిందని సమాచారం.. కీలక సీన్ కోసం ఫైట్ సీన్ చిత్రీకరిస్తున్న సమయంలో కెమెరా ఆయన భుజం పై పడటంతో ఆయనకు గాయం అయ్యిందని టాక్.. దాంతో ఆయనను వెంటనే హాస్పిటల్ కు తరలించారు..
సూర్య లేకపోవడంతో షూటింగ్ ను ఆపేశారట.. ప్రస్తుతం ఆయనకు వైద్యులు పరీక్షలు నిర్వహిస్తున్నారు.. ఆయన హెల్త్ గురించి ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.. వైద్యులు ఆయన హెల్త్ అప్డేట్ ను ఇంకా ఇవ్వలేదు.. ఇక ఈ చిత్రానికి రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సౌండ్‌ట్రాక్ మరియు నేపథ్య సంగీతాన్ని అందించారు. వెట్రి పళనిసామి సినిమాటోగ్రఫీని నిర్వహించగా, ఈ చిత్రానికి నిషాద్ యూసఫ్ ఎడిటింగ్ చేశారు. స్టూడియో గ్రీన్, యువి క్రియేషన్స్ బ్యానర్లపై కె.ఇ.జ్ఞానవేల్ రాజా, వంశీ, తెలుగు నిర్మాత ప్రమోద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రాన్ని పాన్-ఇండియన్ చిత్రంగా స్టూడియో గ్రీన్ పది భాషల్లో 3డిలో విడుదల చేయనుంది..