సూర్య అంటే ఒక సినిమా పేరు కాదు, బాక్సాఫీస్ దగ్గర ఒక భరోసా. ‘గజినీ’లో మాస్ చూపించినా, ‘జై భీమ్’ లో క్లాస్ మెప్పించినా అది సూర్యకే సాధ్యం. కేవలం హీరోగానే కాకుండా, తన నటనలో వైవిధ్యం కోసం ఎంతటి రిస్క్ అయినా చేసే నటుడు ఆయన. అందుకే రెండు రాష్ట్రాల్లోనూ ఆయనకు అంత క్రేజ్. ఇక తాజాగా సూర్య తన 47వ సినిమాను (#Suriya47) నేడు చెన్నైలో పూజా కార్యక్రమాలతో అత్యంత ఘనంగా ప్రారంభించారు. ‘ఆవేశం’ సినిమాతో సంచలనం సృష్టించిన మలయాళ దర్శకుడు జిత్తు మాధవన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండటంతో అంచనాలు అప్పుడే ఆకాశాన్ని తాకాయి. రేపటి నుంచే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.
Also Read : Bhagyashri-Ram : రామ్ ప్రవర్తన పై నోరు విప్పిన భాగ్యశ్రీ..
ఈ సినిమాలో సూర్యతో పాటు మలయాళం లో ఫుల్ క్రేజ్ ఉన్న యంగ్ హీరో నస్లెన్ మరియు క్యూట్ బ్యూటీ నజ్రియా ఫహద్ నటిస్తుండటం విశేషం. చాలా కాలం తర్వాత నజ్రియా ఇలాంటి ఒక బిగ్ ప్రాజెక్ట్‌లో భాగం కావడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఇక ఈ చిత్రానికి మ్యూజిక్ సెన్సేషన్ సుశిన్ శ్యామ్ సంగీతం అందిస్తున్నారు. ‘ఆవేశం’ లాంటి ఒక మాస్ ఎనర్జిటిక్ మూవీ తర్వాత జిత్తు మాధవన్ సూర్యను ఏ రేంజ్ క్యారెక్టర్‌లో చూపిస్తారో అని కోలీవుడ్ మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.