Gujarat: సూరత్‌లో బాలికపై లైంగిక వేధింపులు.. నిందితుడిని శిక్షించాలంటూ భారీ ఆందోళన
- సూరత్‌లో బాలికపై లైంగిక వేధింపులు
- నిందితుడిని శిక్షించాలంటూ భారీ ఆందోళన
- పెద్ద ఎత్తున పోలీసులు మోహరింపు
గుజరాత్‌లోని సూరత్‌లో దారుణం జరిగింది. ట్యూషన్ నుంచి ఇంటికి వస్తున్న హిందూ బాలికపై ఓ యువకుడు లైంగిక వేధింపులకు దిగాడు. ఈ ఘటన తీవ్ర ఆగ్రహావేషాలకు గురి చేసింది. నిందితుడ్ని కఠినంగా శిక్షించాలంటూ అల్తాన్ పోలీస్ స్టేషన్ ఎదుట పెద్ద ఎత్తున ప్రజలు ఆందోళన చేపట్టారు. రాత్రంతా తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.
శుక్రవారం రాత్రి బాలిక ట్యూషన్ నుంచి ఇంటికి వస్తోంది. దారిలో మరో మతానికి చెందిన యువకుడు స్కూటీపై వచ్చి లైంగికంగా వేధించాడు. దీంతో బాలిక తీవ్ర భయాందోళనకు గురైంది. దీంతో బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే హిందూ సంస్థలకు చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో అల్తాన్ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని నిందితుడిని తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు. స్టేషన్ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా హిందూ సంస్థలకు పోలీసుల మధ్య తీవ్ర ఘర్షణలు చోటుచేసుకున్నాయి.
Also Read
పరిస్థితులు చేదాటిపోవడంతో నాలుగు పోలీస్ స్టేషన్లకు చెందిన పోలీసులు మోహరించారు. డీసీపీ, ఏసీపీ, నాలుగు నుంచి ఐదు పోలీస్ స్టేషన్ల పోలీసు సిబ్బందితో పాటు క్రైమ్ బ్రాంచ్ రంగంలోకి దిగింది. పరిస్థితులను చక్కదిద్దారు.
డీసీపీ నిధి ఠాకూర్..
సూరత్ డీసీపీ నిధి ఠాకూర్ మాట్లాడుతూ.. ‘‘శుక్రవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో అల్తాన్ పోలీస్ స్టేషన్ సమీపంలో 15 నుంచి 16 ఏళ్ల వయసున్న ఒక బాలిక తన కోచింగ్ క్లాస్ నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా యాక్టివాపై వస్తున్న యువకుడు ఆమెపై లైంగిక దాడి చేయడానికి ప్రయత్నించాడు. ఫిర్యాదు అందగానే నిందితుడిని వెంటనే పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చాం. నిందితుడు మా అదుపులో ఉన్నాడు. కేసు నమోదు చేశాం. అతను వేరే మతానికి చెందినవాడై ఉండే అవకాశం ఉంది. ఎలాంటి లాఠీచార్జి జరగలేదు.’’ అని తెలిపారు.
#WATCH | Gujarat: A large crowd gathered at Althan Police Station in Surat and attempted to storm inside after a minor girl student was allegedly molested by a man. Efforts are being made to disperse the crowd. pic.twitter.com/waO8zHHhgm
— ANI (@ANI) April 24, 2026
#WATCH | Surat, Gujarat: DCP Nidhi Thakur says, "Near Althan police station at around 8 PM, a 15 to 16-year-old girl was returning after her coaching class. A boy who was driving an Activa tried to assault her. He was immediately brought to the police station… The accused is in… https://t.co/u9TDlCrC4s pic.twitter.com/0ZnfXnYPzT
— ANI (@ANI) April 24, 2026
తాజావార్తలు
-
Gujarat: సూరత్‌లో బాలికపై లైంగిక వేధింపులు.. నిందితుడిని శిక్షించాలంటూ భారీ ఆందోళన
-
CM Chandrababu: ఎన్టీఆర్ జిల్లా ప్రజా ప్రతినిధులతో చంద్రబాబు ప్రత్యేక భేటీ.. సమన్వయంతో పని చేయండి.. ఆత్మ విమర్శ అవసరం..
-
Virat Kohli: “ఆ ఇన్నింగ్స్ వల్లే నాపై ఒత్తిడి తగ్గింది.. నాకంటే చాలా బాగా ఆడాడు”.. కోహ్లీ ప్రశంసల వర్షం!
-
Nayanthara: బాలయ్య ‘NBK 111’ నుంచి నయనతార అవుట్? రెమ్యునరేషన్ వల్లేనా?
-
Tirumala Adulterated Ghee Case: తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారం.. ముగిసిన ఏక సభ్య కమిషన్ విచారణ..
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!