Government Teacher Arrested: మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని తికమ్‌గఢ్ జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో చోటుచేసుకున్న ఘటన తీవ్ర కలకలం రేపింది. మొదటి తరగతి చదువుతున్న మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలపై ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, గురువారం ఉదయం మైనర్ బాలిక పాఠశాలకు వెళ్లిన సమయంలో అక్కడ పనిచేస్తున్న ఉపాధ్యాయుడు ఆమెతో అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు ఉన్నాయి. పాఠశాల నుంచి ఇంటికి తిరిగివచ్చిన బాలిక ఈ…