Site icon NTV Telugu

Supreme Court: నేడే బీఆర్ఎస్ పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణ

Supreme Court 1

Supreme Court 1

Supreme Court: నేడు సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేల కేసు విచారణ జరుగనుంది. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఈ ఎమ్మెల్యేలపై ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని, తమ పిటిషన్‌పై త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరుతూ బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ కేసును జస్టిస్ బిఆర్ గవాయి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టనుంది. గత విచారణలో, ఈ ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్ ఎప్పుడు నిర్ణయం తీసుకుంటారని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. స్పీకర్ తరఫున న్యాయవాది ముఖుల్ రోహిత్గి, సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటామని కోర్టుకు తెలియజేశారు. అయితే, “సరైన సమయం అంటే ఈ ఎమ్మెల్యేల పదవీకాలం ముగిసే సమయమా?” అని ధర్మాసనం ప్రశ్నించింది.

Read Also: Russia- America: నేడు అమెరికా- మాస్కో విదేశాంగ మంత్రుల భేటీ.. త్వరలో రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు!

ఇప్పటికే 10 నెలలు గడిచిపోయాయి. అయినప్పటికీ, స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఇది రీజనబుల్ టైమ్ కాదని ధర్మాసనం అభిప్రాయపడింది. స్పీకర్ సమయం నిర్ధేశించకుంటే, తామే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది. ఈ కేసు తీర్పు రాజకీయంగా కీలకంగా మారనుంది. స్పీకర్ నిర్ణయం ఆలస్యం కావడంతో, సుప్రీంకోర్టు ఏ విధమైన ఆదేశాలు జారీ చేస్తుందో చూడాల్సి ఉంది. దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, పరిగి శ్రీనివాస్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, కాలే యాదయ్య, టి ప్రకాష్ గౌడ్, అరికపూడి గాంధీ, గూడెం మహిపాల్ రెడ్డి, ఏం సంజయ్ కుమార్ లు బిఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలు. ఈ కేసు తీర్పు రాజకీయంగా కీలకంగా మారనుంది. స్పీకర్ నిర్ణయం ఆలస్యం కావడంతో, సుప్రీంకోర్టు ఏ విధమైన ఆదేశాలు జారీ చేస్తుందో చూడాల్సి ఉంది.

Exit mobile version