తెలంగాణలో గత కొంతకాలంగా హాట్ టాపిక్‌గా మారిన ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో మరో కీలక మలుపు చోటుచేసుకుంది. బీఆర్ఎస్ (BRS) పార్టీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేల అనర్హత వేటుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొన్న తరుణంలో, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పార్టీ మారిన వ్యవహారంలో మరో ఇద్దరు ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇస్తూ ఆయన తీర్పునిచ్చారు. బీఆర్ఎస్ గుర్తుపై గెలిచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని…
Supreme Court : ఢిల్లీలో బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై సుప్రీం కోర్టులో మరోసారి విచారణ ప్రారంభమైంది. ఈ మేరకు జస్టిస్ బీఆర్ గవాయ్, ఆగస్టీన్ జార్జ్ మసీహ్‌ల ద్విసభ్య ధర్మాసనం వాదనలు వింటోంది. కేసులో ఇప్పటికే బీఆర్‌ఎస్ తరఫున ఆర్యమా సుందరం వాదనలు వినిపించగా, అసెంబ్లీ స్పీకర్ తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ తన వాదనలు వినిపిస్తున్నారు. కేసులో సింగిల్ బెంచ్ తీర్పును కొట్టేసిన డివిజన్ బెంచ్…
Supreme Court : తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హతపై దాఖలైన పిటిషన్‌పై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసును పరిశీలించింది. విచారణలో జస్టిస్ గవాయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగ ధర్మాసనాల పూర్వపు తీర్పులు ఉన్నప్పటికీ, ఈ వ్యవహారాల్లో ఎప్పటిలోగా తేల్చాలని స్పష్టంగా చెప్పలేదన్నారు. ఉన్నత ధర్మాసనాల తీర్పులను ఎలా తిరిగి రాయగలమని ప్రశ్నించారు. ఈ సందర్భంగా ధర్మాసనం పలు ప్రశ్నలను సంధించింది. పార్టీ ఫిరాయింపులపై చర్యలు తీసుకోవడానికి…
Supreme Court: నేడు సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేల కేసు విచారణ జరుగనుంది. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఈ ఎమ్మెల్యేలపై ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని, తమ పిటిషన్‌పై త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరుతూ బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ కేసును జస్టిస్ బిఆర్ గవాయి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టనుంది. గత విచారణలో, ఈ ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్ ఎప్పుడు నిర్ణయం తీసుకుంటారని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. స్పీకర్…